Ap Telangana
AP Telangana: తెలంగాణలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేయడంతో ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలకు ఆటంకాలు తొలగిపోయాయి. ఇకపై పాస్ అవసరం లేకుండానే తెలంగాణలోకి రావచ్చని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి నుంచే ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలోకి వాహనాలను అనుమతిస్తున్నారు.
ఇక ఆంధ్రప్రదేశ్ లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉండటంతో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఆంధ్రాలోకి వెళ్ళాలి అంటే తప్పని సరి ఈ-పాస్ కావాలని అధికారులు స్పష్టం చేశారు. కర్ఫ్యూ అమలులో లేని సమయంలో ఈ-పాస్ అవసరం లేదని వివరించారు.