Telangana : తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు, జూన్ 10 వరకు ..సమయాల్లో మార్పులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Telangana Lockdown

Lockdown Extension : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడికి లాక్ డౌన్ కొనసాగించడమే బెటర్ అని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగా మరో 10 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగించింది. జూన్ 10 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ..తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్న సంగతి తెలిసిందే.

2021, మే 30వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ పలు శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా లాక్ డౌన్ తో పాటు వివిధ కీలక అంశాలపై చర్చించారు. జూన్ 10 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తే..బాగుంటుందని కేబినెట్ అభిప్రాయం వ్యక్తం చేసింది. అయితే సమయాల్లో మార్పు చేస్తే బెటర్ అని భావించి..సడలింపులు ఇచ్చారు.

ఉదయం 06 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్ డౌన్ మినహాయింపు ఇచ్చారు. ప్రజలు ఇళ్లకు చేరుకొనేందుకు మధ్యాహ్నం 2 గంటల వరకు వెసుబాటు కల్పించింది. తర్వాత..లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు.

ప్రస్తుతం ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీ కొనసాగుతోంది. భేటీ తర్వాత అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిరాడంబరంగానే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.

Read More : Steal Money: లవర్‌ కోసం పేరెంట్స్‌కు నిద్ర మాత్రలిచ్చి సొంతింట్లోనే రూ.13లక్షలు దొంగతనం