Lok Sabha Bulletin On MP Bandi Sanjay Arrest
Bandi Sanjay Arrest Lok Sabha Bulletin : బండి సంజయ్ అరెస్ట్‌పై లోక్‌సభ బులెటిన్ విడుదల చేసింది. కరీంనగర పోలీసులు ఇచ్చిన ఆధారంగా బులిటెన్ విడుదల చేసింది. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ను సీఆర్పీసీ సెక్షన్ 151 ప్రకారం ప్రివెంటివ్ అరెస్ట్ చేసామని కరీంనగర్ పోలీసులు లోక్ సభకు సమాచారం ఇచ్చారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా అర్ధరాత్రి 12.12 నిమిషాలకు అరెస్ట్ చేశామని తెలిపారు. కరీంనగర్ లో బండి సంజయ్ ను అరెస్ట్ చేసి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు తరలించామని ఆ తరవాత పోలీస్ కష్టడీ నుంచి విడిచిపెట్టామని కరీంనగర్ పోలీసులు లోక్ సభకు వెల్లడించారు.
కాగా బండి సంజయ్ రిమాండ్ రద్దు చేయాలని కోరుతు దాఖలైన పిటిషన్ పై లంచ్ మోషన్ లో హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటీషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది. సంజయ్ పై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన తరపు న్యాయవాది వాదించారు. బెయిల్ పిటిషన్ పై ఈ రోజే నిర్ణయం తీసుకునేలా కింది కోర్టుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోరారు. దీంతో న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను ఏప్రిల్ 10కి వాయిదా వేసింది.
Bandi Sanjay Wife: బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదు.. బండి సతీమణి అపర్ణ