10th Paper Leak case : కేసీఆర్ మెడలు వంచే టైమ్ దగ్గరపడింది .. కుట్రలో భాగంగానే నాపై పేపర్ లీక్ కేసు – బండి సంజయ్

10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయి కరీంనగర్ జైలులో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని కుట్ర చేసిన నాపై పేపర్ లీక్ కేసు పెట్టారని ఆరోపించారు. కేసీఆర్ మెడలు వంచే సమయం దగ్గరపడిందని కుట్రలో భాగంగానే నాపై పేపర్ లీక్ కేసు పెట్టి జైలుకు పంపించారని ఆరోపించారు.

10th Paper Leak case : కేసీఆర్ మెడలు వంచే టైమ్ దగ్గరపడింది .. కుట్రలో భాగంగానే నాపై పేపర్ లీక్ కేసు – బండి సంజయ్

10th Paper Leak case

10th Paper Leak case: 10th క్లాస్ క్వశ్చన్ పేపర్ లీక్ చేశారని ఆరోపణలతో అరెస్ట్ అయి కరీంనగర్ జైలులో ఉన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ జైలు నుంచే కార్యకర్తలకు సందేశం ఇచ్చారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నానని కుట్ర చేసిన నాపై పేపర్ లీక్ కేసు పెట్టారని ఆరోపించారు. ఇటువంటి కేసులకు నేను భయపడనని బీజేపీ కార్యకర్తలు కూడా భయపడరని..అధికారంతో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతున్నారంటూ బండి సంజయ్ విమర్శించారు. TSPSC లీకేజీలో వైఫల్యాలు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపినందుకే నాపై పేపర్ లీక్ కేసు బనాయించి జైలుకు పంపించారన్నారు.

ఇటువంటి కేసులను భయపడనని ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నానని కార్యకర్తలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దంటూ బండి సూచించారు. పేపర్లు లీక్ చేసి 30 లక్షల నిరుద్యోగులతో కేసీఆర్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ..టెన్త్ విద్యార్థుల జీవితాలతోనూ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు.

Bandi Sanjay Wife: బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదు.. బండి సతీమణి అపర్ణ

ఇటువంటి కుట్రలు ఎన్ని చేసినా నా పోరాటం ఆగదన్నారు. కేసీఆర్ మెడలు వంచే సమయం దగ్గరపడిందనీ..రాబందుల రాజకీయ క్రీడ నుంచి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం
అంటూ బీజేపీ కార్యకర్తలకు బండి సంజయ్ జైలునుంచే సందేశం ఇచ్చారు.TSPSC పేపర్‌ లీక్‌ను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.TSPSC పేపర్‌ లీక్‌ చేసి నిరుద్యోగుల్ని మోసం చేసినందుకు నిరుద్యోగులకు కు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి అని బండి సంజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాగా..జైలులో ఉన్న భర్తను కవటానికి బండి సంజయ్ భార్య అపర్ణ తన తమ్ముడు, కుమారుడితో కలిసి వెళ్లారు. గురువారం ఉదయం ములాఖత్ కింద భార్య అపర్ణ దరఖాస్తు చేసుకోగా అనుమతి ఇవ్వడంతో గురువారం 11 గంటల సమయంలో సంజయ్ ను కలిసేందుకు వారు జైలుకు వెళ్లారు. జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత సంజయ్ సతీమణి అపర్ణ మాట్లాడారు. బండి సంజయ్ అక్రమ కేసులకు భయపడే వ్యక్తి కాదన్నారు. బండి సంజయ్ అక్రమ అరెస్ట్ విషయంలో ఖండించిన ప్రతి కార్యకర్తకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపమని చెప్పారని తెలిపారు.

CP Ranganath: అందుకే పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్.. బండి సంజయ్ ఫోన్ ఎక్కడ ఉందో చెప్పడం లేదు: సీపీ రంగనాథ్