అప్పట్లో కేసీఆర్ రైతుల వద్దకు వెళ్లలేదు.. ఇప్పుడు వెళ్తున్నారు: మహేశ్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud: కరవుకు కారణం కాంగ్రెస్ అని కేసీఆర్ మాట్లాడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు.

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పొలం బాట పేరుతో రైతుల వద్దకు వెళ్లడంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ఆయన రైతుల వద్దకు వెళ్తుంటే చాలా విచిత్రంగా ఉందంటూ మహేశ్ కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

తెలంగాణలో కరవు, వరదలు వచ్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన సమయంలో కేసీఆర్ ఎప్పుడైనా రైతుల వద్దకు వెళ్లారా అని నిలదీశారు. అధికారం పోయాక ఇప్పుడు రైతులు గుర్తుకొస్తున్నారా అని ప్రశ్నించారు. రైతు బంధు, పంటల బీమా గురించి కేసీఆర్ అసత్యాలు మాట్లాడుతున్నారని చెప్పారు.

కేసీఆర్ మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. రైతుల బలవన్మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని చెప్పారు. వరివేస్తే ఉరి వేసినట్టేనని కేసీఆర్ రైతులను భయపెట్టారని అన్నారు. ఇప్పడు వరి పంటలను చూస్తున్నారని చెప్పారు.

కరవుకు కారణం కాంగ్రెస్ అని కేసీఆర్ మాట్లాడం ఆయన దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే వింత ప్రాజెక్టు అని విమర్శించారు. ఎన్ని చెప్పిన కేసీఆర్ మాటలు తెలంగాణ ప్రజలు నమ్మరని చెప్పారు.

Mlc Kavitha Bail Petition : బెయిల్ వచ్చేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రేపు విచారణ

ట్రెండింగ్ వార్తలు