Mlc Kavitha Bail Petition : బెయిల్ వచ్చేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ

తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందు వల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోరారు.

Mlc Kavitha Bail Petition : బెయిల్ వచ్చేనా? కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణ

Mlc Kavitha Bail Petition

Mlc Kavitha Bail Petition : సోమవారం రౌస్ అవెన్యూ కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరగబోతోంది. సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి కావేరీ బవేజా ఈ పిటిషన్ ను విచారించబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 26న మధ్యంతర బెయిల్ కోసం కవిత పిటిషన్ దాఖలు చేశారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందు వల్ల ఏప్రిల్ 16వ తేదీ వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత కోరారు. కవితకు బెయిల్ మంజూరుపై ఇప్పటికే ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వకూడదని ఈడీ కోరే అవకాశం ఉంది. కవిత బెయిల్ పై బయటకు వస్తే సాక్ష్యులను, ఆధారాలను ప్రభావితం చేస్తారని ఈడీ భావిస్తోంది.

మరోవైపు కవితకు జైల్లో సదుపాయాల కల్పనపైనా కోర్టు విచారణ జరపబోతోంది. ఎమ్మెల్సీ కవితకు సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల కవిత తరుపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఇంటి భోజనం, పడుకోవడానికి మంచం, పరుపులు, చెప్పులు, దుప్పట్లు, బట్టలు, పుస్తకాలు, పెన్ను పేపర్లు, మందులు తీసుకెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ, తీహార్ జైలు అధికారులు అవేవీ అమలు చేయలేదు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించారు కవిత.

Also Read : దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం మల్కాజిగిరిలో ఆధిపత్యమెవరిది?