Bhatti Vikramarka: బీఏసీలో బీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదు: భట్టి విక్రమార్క 

మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పినట్లు సభ పనిదినాలు ఉండాలంటే ఎలా అని భట్టి విక్రమార్క నిలదీశారు.

అసెంబ్లీ నిబంధనల మేరకే బీఏసీ జరిగిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడారు. బీఏసీలో బీఆర్‌ఎస్‌ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని చెప్పారు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడుపాలన్నది స్పీకర్ నిర్ణయిస్తారని, పదేళ్లు పాలించిన వారికి ఇది తెలియదా? అని అన్నారు.

మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పినట్లు సభ పనిదినాలు ఉండాలంటే ఎలా అని భట్టి విక్రమార్క నిలదీశారు. తాను ఎల్వోపీగా ఉన్నప్పుడు.. గత ప్రభుత్వం చేసింది తనకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పుడు కూడా సభ ఎన్ని రోజులు జరపాలో స్పీకరే డిసైడ్ చేస్తారని తెలిపారు.

కాగా, ఇవాళ సీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్‌ వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. కనీసం 15 రోజులు సభ నడపాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్ చేసింది. ఎన్ని రోజులు సభ నడుపుతారో చెప్పకపోవడంతో బీఏసీ నుంచి వాకౌట్ చేశామని హరీశ్ రావు అన్నారు. రేపు లగచర్ల అంశంపైన చర్చకు పట్టు పడతామని తెలిపారు. లగచర్లపైన చర్చకు పట్టుపట్టామని, రైతులకు బేడీలు వేసిన అంశం తమకు చాలా కీలకం అని చెప్పారు.

Nara Lokesh : జోగి రమేశ్‌ను ఎవరు రమ్మన్నారు? మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీషలపై నారా లోకేశ్ సీరియస్..