Nara Lokesh : జోగి రమేశ్‌ను ఎవరు రమ్మన్నారు? మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీషలపై నారా లోకేశ్ సీరియస్..

జోగి రమేశ్ తో టీడీపీ నేతలు చెట్టపట్టాల్ వేసుకు తిరగడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది.

Nara Lokesh : జోగి రమేశ్‌ను ఎవరు రమ్మన్నారు? మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే శిరీషలపై నారా లోకేశ్ సీరియస్..

Updated On : December 16, 2024 / 5:55 PM IST

Nara Lokesh : కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో నిన్న జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో టీడీపీ నేతలతో కలిసి జోగి రమేశ్ పాల్గొనడంపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పార్థసారథి, గౌతు శిరీషను వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఇదే కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, గౌతు శిరీష పాల్గొన్న సంగతి తెలిసిందే.

నూజివీడు నియోజకవర్గంలో జరిగిన ఘటన టీడీపీ హైకమాండ్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. పార్టీ నేతలు పక్క పార్టీ నేతలతో చెట్టాపట్టాలేసుకుని తిరగడంపై కార్యకర్తల్లో రాంగ్ మేసేజ్ వెళ్తుందని పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. సర్దార్ గౌతు లచ్చన్న కాంస్య విగ్రహావిష్కరణ నిన్న నూజివీడులో జరిగింది. అది బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగిందని చెబుతున్నా.. గౌడ సామాజికవర్గ ప్రతినిధులు కొనకొళ్ల నారాయణ, కొనకళ్ల పుల్లయ్య.. గౌతు లచ్చన్న మనవరాలు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.

ఇదే సమయంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జోగి రమేశ్ తో టీడీపీ నేతలు చెట్టపట్టాల్ వేసుకు తిరగడాన్ని పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోతోంది. ఈ ఉదయం నుంచి సోషల్ మీడియాలో ఈ అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేశ్ సీరియస్ అయ్యారు. మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే శిరీషను ఆయన వివరణ అడిగారు.

జోగి రమేశ్.. చంద్రబాబును తూలనాడే వారు. చంద్రబాబు లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషించే వారు. చంద్రబాబు ఇంటిపైనా దాడికి యత్నించారు. అలాంటి వ్యక్తితో టీడీపీ నేతలు చెట్టాపట్టాల్ వేసుకుని తిరగడం ఏంటని కార్యకర్తలు మండిపడుతున్నారు.

స్థానికంగా గౌడ సంఘంలో యాక్టివ్ గా ఉండే శివరామకృష్ణ అనే వ్యక్తి.. జోగి రమేశ్ ను ఆహ్వానించినట్లు చెబుతున్నారు. ఇది పూర్తిగా కమ్యూనిటీ కార్యక్రమం అని చెబుతున్నారు. కాగా, జోగి రమేశ్ లాంటి వైసీపీ నేతలతో టీడీపీ నేతలు చెట్టపట్టాలేసుకుని తిరగడం విమర్శలకు తావిచ్చింది. దీన్ని టీడీపీ హైకమాండ్ సీరియస్ గా తీసుకుంది. జోగి రమేశ్ ఎలాంటి యాక్టివిటీలు చేశారో తెలిసిందే అని లోకేశ్ అంటున్నారు. ఆయనపై కేసులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడిని జైలుకి పంపించిన పరిస్థితి ఉంది. చంద్రబాబును ప్రతిసారి తూలనాడారు. చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారు.

అటువంటి వ్యక్తితో ఒకే స్టేజ్ ను పంచుకోవాల్సిన వచ్చినప్పుడు.. టీడీపీ నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని హైకమాండ్ అంటోంది. అలా కాకుండా జోగి రమేశ్ తో చెట్టపట్టాలేసుకుని తిరగడం ఏంటని పార్టీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. అసలు అదే ఏ సందర్భంలో జరిగింది? కావాలని అరేంజ్ చేశారా? అనుకోకుండా జరిగిందా? అనేదానిపై లోకేశ్ వివరణ అడిగారు. రాజకీయంగా నిన్నటి వరకు పోరాటం చేసిన పక్క పార్టీ నేతతో
కలిసి మెలిసి తిరిగితే ప్రజలు, క్యాడర్ లో ఎటువంటి సందేశం వెళ్తుంది అనేది టీడీపీ హైకమాండ్ వాదనగా కనిపిస్తోంది. మొత్తంగా ఈ అంశంపై పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా ఉందని చెప్పాలి.