Hyderabad Rain : వరదలో స్కూటీతో కొట్టుకపోయిన యువకుడు

  • Publish Date - September 21, 2020 / 07:25 AM IST

Rain and flooding in Hyderabad : హైదరాబాద్ లో మరో విషాద ఘటన ఒకటి చోటు చేసుకుంది. మొన్న కురిసిన భారీ వర్షానికి మల్కాజ్ గిరిలో సుమేధ చిన్నారి నాలాలో పడి మరణించిన ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకుంది.



రహదారి నీటిని కాల్వగా మార్చడంతో ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. రహదారిని దాటే క్రమంలో..వరదనీటిలో స్కూటీతో సహా కొట్టుకపోయాడు. సరూర్ నగర్ ప్రాంతంలో అందరీ కళ్ల ముందే జరుగుతున్నా..ఎవరూ కాపాడలేకపోయారు. 2020, సెప్టెంబర్ 20వ తేదీ ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. అతని ఆచూకీ ఇంకా దొరకడం లేదు.



ఏమీ జరిగింది : –
బాలాపూర్‌ మండలం అల్మాస్‌గూడకు చెందిన నవీన్‌కుమార్‌(32) ఎలక్ట్రీషియన్‌ గా పని చేస్తుంటాడు. ఆదివారం సాయంత్రం సరూర్ నగర్ చెరువు కట్ట కింద నుంచి సరూర్ నగర్ గాంధీ విగ్రహం చౌరస్తా వైపు స్కూటీ వాహనంపై బయలుదేరాడు. అయితే..భారీ వర్షాలకు తపోవన్ కాలనీ రోడ్ నెంబర్ 06 వరద నీరు పోటెత్తింది.



వరదనీరు…చెరువులోకి వెళుతోంది. వరద నీటిని దాటే ప్రయత్నం చేశాడు. పట్టు తప్పడం కింద పడిపోవడం..అందరూ చూస్తుండగానే నవీన్ కొట్టుకపోయాడు. కాపాడేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు వచ్చి గజ ఈతగాళ్లను రప్పంచారు. నవీన్ కోసం గాలిస్తున్నారు.