దసరా రోజు..చికెన్ వండలేదని భార్యను చంపేశాడు

  • Published By: madhu ,Published On : October 28, 2020 / 08:20 AM IST
దసరా రోజు..చికెన్ వండలేదని భార్యను చంపేశాడు

Updated On : October 28, 2020 / 10:51 AM IST

man eliminated wife not cooking chicken : దసరా పండుగ రోజు కోడి కూర వండలేదని భార్యను చంపేశాడు ఓ భర్త. ఈ ఘటన నాగర్ కర్నూలులో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో సన్నయ్య, సీతమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు.



సన్నయ్య మద్యానికి బానిసయ్యాడు. దసరా పండుగ రోజున ఫుల్ గా మద్యం తాగి..ఇంటికి వచ్చాడు. చికెన్ వండాలని భార్య సీతమ్మకు చెప్పాడు. అయితే..ఆమె వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య భార్యను విపరీతంగా కొట్టాడు. ఆ దెబ్బలకు సీతమ్మ ప్రాణాలు విడిచింది. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు.



దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులుకు సమచారం ఇవ్వగా.. అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.