MLA Kokkirala PremSagar Rao: సీఎం రేవంత్, భట్టివిక్రమార్కపై ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు ఆసక్తికర కామెంట్స్

సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కపై మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Mancherial MLA Kokkirala PremSagar Rao interesting Comments on CM Revanth Reddy

Mancherial MLA Kokkirala PremSagar Rao: తనతో పాటు ఎమ్మెల్సీలు అయిన రేవంత్ రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క.. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి అయ్యారని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు అన్నారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన గురువారం తెలంగాణ అసెంబ్లీకి వచ్చారు. మల్లు భట్టివిక్రమార్క చాంబర్ వెళ్లి చిట్ చాట్ చేశారు. రాష్ట్ర మంత్రి వర్గంలో తమ జిల్లాలను పక్కన పెట్టారని ఆయన అన్నారు.

”భట్టి, రేవంత్, నేను ఒకేసారి ఎమ్మెల్సీలు అయ్యాం. ఒకాయన ముఖ్యమంత్రి, మరొకాయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నేను మాత్రం చాంబర్ల చుట్టూ తిరుగుతున్నా. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర మ్యాప్ లో ఉండటం లేదు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఆదిలాబాద్ జిల్లాకు చోటు లేదు. అప్పుడు కాంగ్రెస్ పాలనలో జిల్లాను పక్కన పెట్టారు, మళ్ళీ ఇప్పుడు అలాగే జిల్లాను పక్కన పెట్టారు. BRS హయాంలో ఇద్దరు మంత్రులు ఉన్నా ఉండనట్లే ఉన్నార”ని ప్రేమ్‌సాగర్ రావు వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి బల్మూరి వెంకట్
ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆర్టీసీ బస్సులో అసెంబ్లీకి చేరుకున్నారు. నాంపల్లి నుంచి అసెంబ్లీ వరకు బస్సులో ప్రయాణించారు. ఉచిత బస్సు ప్రయాణంపై మహిళలతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

Also Read: మిషన్ భగీరథ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

కేసీఆర్ ఛాంబర్ మార్పు
అసెంబ్లీ ఆవరణలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్‌ను ప్రభుత్వం మార్చేసింది. ఆయనకు చిన్న ఛాంబర్ కేటాయించింది. అంతకుముందు కేటాయించిన కార్యాలయాన్ని స్పీకర్ కార్యాలయ అవసరాల కోసం వినియోగించనున్నారు.

Also Read: 20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని రేవంత్‌కి చెప్పాను.. లేట్ చేయొద్దన్నాను: జగ్గారెడ్డి సంచలన కామెంట్స్