20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని రేవంత్‌కి చెప్పాను.. లేట్ చేయొద్దన్నాను: జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

Jagga Reddy: మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలాగా ఉన్నా.. లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయ్యిందని..

20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని రేవంత్‌కి చెప్పాను.. లేట్ చేయొద్దన్నాను: జగ్గారెడ్డి సంచలన కామెంట్స్

Jagga Reddy

Updated On : February 7, 2024 / 7:38 PM IST

Jagga Reddy: పార్లమెంట్ ఎన్నికలలోపు 20 మంది ఎమ్మెల్యేలను లాక్కుందామని సీఎం రేవంత్ రెడ్డికి చెప్పానని, లేట్ చేయొద్దన్నానని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇవాళ జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరేందుకు బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. వీలైనంత త్వరగా చేర్చుకుంటామని చెప్పారు.

మాజీ సీఎం కేసీఆర్ ఆ ఎమ్మెల్యేల వద్ద కాపలాగా ఉన్నా.. లాక్కుంటామన్నారు. కార్యాచరణ స్టార్ట్ అయ్యిందని జగ్గారెడ్డి చెప్పారు. ఎమ్మెల్యేలను ఆపుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలు డ్రామాలు చేస్తున్నారని తెలిపారు. ఈ ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, ఎవరికీ అనుమానం అవసరం లేదని అన్నారు.

తాము ప్రభుత్వంలో ఈ ఐదేళ్లు మాత్రమే కాకుండా ఆ తర్వాతి ఐదేళ్లు కూడా ఉంటామన్నారు. మూడు నెలల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అంటున్నారని జగ్గారెడ్డి చెప్పారు.

విజయసాయి రెడ్డితో బీజేపీనే మాట్లాడిస్తుందా? అని జగ్గారెడ్డి నిలదీశారు. బీజేపీ డైరెక్షన్ లో జగన్, కేసీఆర్ పని చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయం వల్ల ఇరు ప్రాంతాలకు స్వయం పరిపాలన వచ్చిందని తెలిపారు. తెలంగాణ ఆర్థికాభివృద్ధి చెందవద్దని కేసీఆర్, కేటీఆర్, జగన్ కుట్ర చేస్తున్నారని అన్నారు.

Also Read: అమిత్ షా‌తో భేటీ కానున్న చంద్రబాబు.. పొత్తులు, సీట్లపై కీలక చర్చ.. బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?