మిషన్ భగీరథ పథకంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
42వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీమ్ లో సుమారు 6వేల నుంచి 7వేల కోట్ల రూపాయల మేర..

Mission Bhagiratha Scheme
Mission Bhagiratha Scheme : మిషన్ భగీరథ పథకం అవకతవకలపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. మిషన్ భగీరథపై విజిలెన్స్ విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు సీఎం రేవంత్. 42వేల కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని గత ప్రభుత్వం చేపట్టింది. ఈ స్కీమ్ లో సుమారు 6వేల నుంచి 7వేల కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఇంట్రా విలేజ్ వర్క్స్ లో గోల్ మాల్ జరిగిందని, నల్లాలు పైప్ లైన్లు వేయకుండానే బిల్లులు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి.
Also Read : బీజేపీకి మాజీ మంత్రి, సినీ నటుడు బాబు మోహన్ రాజీనామా.. కారణం ఏమిటంటే?
కొనకుండానే మెటీరియల్ కొన్నట్లుగా నిధుల దుర్వినియోగం జరిగినట్లుగా, కొత్త మెటీరియల్ వాడకుండా పక్కన పడేసినట్లుగా ఫిర్యాదులు అందాయి. ఒక్కో మండలంలో ఒక్కో గ్రామంలో విచారణ చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది. 2016 ఆగస్టు 7న గజ్వేల్ నియోజకవర్గంలో మిషన్ భగీరథ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు.
Also Read : లోక్‌సభ అభ్యర్థులపై కాంగ్రెస్ కసరత్తు.. ఎంపీ సీటు కోసం పోటీ పడుతున్న ఆశావహులు వీరే..