Massive Fire Breaks Out : అమీర్‌పేటలో అగ్నిప్రమాదం.. భవనం అంతటా వేగంగా వ్యాపించిన మంటలు.. భారీగా ట్రాఫిక్ జామ్
Massive Fire Breaks Out : హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.
Massive Fire Breaks Out
Massive Fire Breaks Out : హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేటలో గురువారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం సిగ్నల్ సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద పిల్లర్ నెంబర్ 1043 వద్ద ఉన్న కేఎస్సాఆర్ షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నుంచి మంటలు ఎగుసిపడ్డాయి. ఈ క్రమంలో పక్కనే ఉన్న ఓ మెస్ కు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది నిమిషాల్లో మంటలు వేగంగా భవనం మొత్తం వ్యాపించాయి.
భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానిక ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ అగ్నిప్రమాద ఘటనతో అమీర్‌పేట ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలంకు చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా భారీగా దట్టమైన పొగలు అలముకున్నాయి. అయితే, ఈ అగ్నిప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. భారీగా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం.
వాహనదారులకు సజ్జనార్ కీలక సూచన..
అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు ఈ మార్గంలో ప్రయాణించకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సజ్జనార్ ట్విటర్ వేదికగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విధుల్లో ఉన్న ట్రాఫిక్, అత్యవసర సిబ్బందికి సహకరించాలని కోరారు.
ట్రాఫిక్ అలర్ట్!
అమీర్‌పేటలోని శ్రీనివాసనగర్ వెస్ట్, మెట్రో పిల్లర్ నంబర్ A1043 సమీపంలో ఉన్న కెఎస్సార్ ఫ్యాషన్స్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అత్యవసర సహాయక చర్యల కారణంగా, అమీర్‌పేట నుండి ఎస్సార్ నగర్ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది, దీనివల్ల ఈ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్…
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) June 4, 2026
