Medha group : తెలంగాణలో ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ సిద్ధం

మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దాదాపు ఇందులో 2 వేల 200 మందికి

Medha Group Rail Coach Factory : తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా..కొండకల్ లో ప్రైవేటు రైల్ కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఇది ఒకటని తెలిపారు. మేధా గ్రూప్ దీనిని నెలకొల్పింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్ రైల్ కోచ్ కు సంబంధించిన ఫ్యాక్టరీ ఫొటోలను ట్విట్టర్ ద్వారా పోస్టు చేశారు. త్వరలోనే రైల్ కోచ్ ల తయారీ, రవాణాకు సిద్ధమవుతుందన్నారు.

Read More : Aadhaar Card Update: ఆధార్‌లో ఫోటో మార్చుకోవాలని అనుకుంటున్నారా? ప్రాసెస్ ఇదే! తెలుసుకోండి

ఇక ఈ ఫ్యాక్టరీ విషయానికి వస్తే.. మంత్రి కేటీఆర్ 2020 ఆగస్టులో దీనికి శంకుస్థాపన చేశారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటైంది. దాదాపు ఇందులో 2 వేల 200 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అందనుందని తెలుస్తోంది. కోచ్ లు, మెట్రో రైళ్లు, మోనోరైల్ తయారవుతాయి. ఏటా 500 కోచ్ లు, 50 లోకోమోటీవ్ ల తయారీ సామర్థ్యం ఈ యూనిట్ కు ఉంది. అత్యాధునికమైన ఎలక్ట్రానిక్ పరికరాలు, ట్రైన్ సెట్స్ తదితర ఉత్పత్తులను మేధా సంస్థ తయారు చేస్తోంది.

Read More : Pawan Kalyan: పంచెకట్టులో మెరిసిన పవన్ కల్యాణ్

భారతీయ రైల్వేలకు వివిధ ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. 1984లో మేధా సంస్థ ప్రారంభమైంది. 1990లో రైల్ కోచ్ లు, రైళ్లకు సంబంధించిన విడిభాగాల తయారీ చేపట్టింది. భారతదేశంతో పాటు అమెరికా, యూరప్, దక్షిణ అమెరికా తదితర దేశాల్లో 12 కంపెనీలు, ఏడు అనుబంధ సంస్థలు, భారత్ లో నాలుగు జాయింట్ వెంచర్ లున్నాయి.

ట్రెండింగ్ వార్తలు