Telangana: తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. కొత్తగా 638కేసులు

తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,14,105 మందికి పరీక్షలు నిర్వహించగా.. 638 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

Corona

Telangana: తెలంగాణలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,14,105 మందికి పరీక్షలు నిర్వహించగా.. 638 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 6లక్షల 41వేల 791కి పెరిగింది. కరోనా మహమ్మారితో ముగ్గురు చనిపోగా.. మొత్తం మృతుల సంఖ్య 3,787కి పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 9,325 యాక్టివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 97.95శాతంగా ఉంది. మరణాల రేటు 0.59గా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 59 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.