Rain Alert : రుతుపవనాలు వచ్చేశాయ్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు.. హెచ్చరికలు జారీ..
Rain Alert : నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24గంటల్లో దక్షిణ అండమాన్ ను రుతుపవనాలు తాకనున్నాయి. అయితే, ఈ రుతుపవనాలు మే 26న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
- Harish Thanniru
- Updated on- May 17, 2026 / 08:26 AM IST
Rain Alert
- అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు
- మే 26నే కేరళను తాకే అవకాశం
- జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ
- తెలంగాణలోని పలు జిల్లాలకు ఇవాళ వర్ష సూచన
Rain Alert : తెలంగాణలో ఎండల తీవ్రత గరిష్ఠ స్థాయికి చేరింది. పలు జిల్లాల్లో 41 నుంచి 44డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకుతోడు ఉక్కపోత ప్రజలకు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం 9గంటల నుంచే ఎండ తీవ్రత ఉండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎండల తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయని.. ఎండల తీవ్రత తగ్గి.. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అయితే, వచ్చే మూడు నాలుగు రోజులు ఎండల తీవ్రత ఎక్కుగానే ఉంటుందని పేర్కొంది.
నైరుతి రుతుపవనాలు వచ్చేశాయి. అండమాన్ సముద్రంలోకి నైరుతి మేఘాలు ప్రవేశించాయి. ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. మరో 24గంటల్లో దక్షిణ అండమాన్ ను రుతుపవనాలు తాకనున్నాయి. అయితే, ఈ రుతుపవనాలు మే 26న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. జూన్ మొదటి వారంలో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ రుతుపవనాలకు సహకరిస్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నారాయణపేటతోపాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షం పడినప్పుడు ఉరుములు, మెరుపులు కూడా వస్తాయని, ఈదురు గాలులు వేగం గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లుగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో 41 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజులుకూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, జూన్ మొదటి వారంలో రుతుపవనాలు ప్రవేశం తరువాత ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని, వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
