Telangana Ministers : గవర్నర్ ను పిలవాలని రాజ్యాంగంలో లేదు.. తమిళిసైపై మంత్రులు ఫైర్

అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు చిన్న చిన్న సాకులు చూపి ఆపుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులతో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందన్నారు.

Telangana Ministers : తెలంగాణలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మాటల యుద్ధం కొనసాగుతోంది. గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్న తీరుపై మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్ తమిళిసై తీరుపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. గవర్నర్ ను సచివాలయ ప్రారంభోత్సవానికి ఆహ్వానించాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు.

వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని పిలిచారా అని గవర్నర్ ను ప్రశ్నించారు. గవర్నర్ తమిళిసై ఎక్కడైనా పోటీ చేసి గెలిచారా అని ప్రశ్నించారు. సిద్దిపేటలో పోటీ చేసినా గవర్నర్ ను ఆహ్వానిస్తానని హరీశ్ రావు అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Governor Tamilisai : తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు

అసెంబ్లీ ఆమోదం తెలిపిన బిల్లులకు చిన్న చిన్న సాకులు చూపి ఆపుతున్నారని పేర్కొన్నారు. పెండింగ్ బిల్లులతో ప్రభుత్వం ఇబ్బంది పడుతుందన్నారు. రాష్ట్రానికి నష్టం జరుగుతున్నప్పుడు తాము రాజ్ భవన్ కు ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు. రాజ్యాంగానికి భిన్నంగా ఉన్న బిల్లుల్లో మార్పునకు గవర్నర్ అధికారం ఉందా అని ప్రశ్నించారు. కోర్టు మెట్లెక్కితే తప్ప ఫైల్ కదలడం లేదన్నారు.

మంత్రి గంగుల కమలాకర్ గవర్నర్ తమిళిసై ఫైర్ అయ్యారు. గవర్నర్ పై గంగుల కీలక వ్యాఖ్యలు చేశారు. అకాల వర్షాల కారణంగా రైతులు నష్టపోయి ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవడం గవర్నర్ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. రైతులు కష్టాల్లో ఉంటే గవర్నర్ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

TS Governor Tamilisai : సుప్రీంకోర్టు విచారణకు ముందు పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం ..

రైతులను గవర్నర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను గవర్నర్ ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. రైతులు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం గవర్నర్ బాధ్యత కాదా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను ఆదుకోవాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు