TS Governor Tamilisai : సుప్రీంకోర్టు విచారణకు ముందు పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం ..

పెండింగ్ బిల్లుల ఆమోదంపై తమిళిసై కీలక నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు విచారణకు ముందు తమిళిసై తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది.

TS Governor Tamilisai : సుప్రీంకోర్టు విచారణకు ముందు పెండింగ్ బిల్లులపై గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం ..

TS governor tamilisai pending bills Appove

TS Governor tamilisai : పెండింగ్ బిల్లుల (pending bills)పై తెలంగాణ గవర్నర్ తమిళి (governor tamilisai)సై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం (TS Govt) గవర్నర్ కు పంపించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టిన బిల్లులపై కీలక నిర్ణయం తీసుకున్న తమిళిసై మూడు బిల్లులను ఆమోదించి మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి తిప్పి పంపించారు. మరో రెండు బిల్లులను పెండింగ్ లో పెట్టారు. కాగా ఏడు బిల్లులను బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నర్ తమిళిసైకు పంపించారు. కానీ గవర్నర్ వాటిని ఆమోదించకుండా ఇప్పటి వరకు పెండింగ్ లోనే ఉంచారు. ఈక్రమంలో ఈ బిల్లుల ఆమోదంపై కీలక నిర్ణయం తీసుకున్న గవర్నర్ మూడు బిల్లులకు ఆమోదం పలికి రెండు బిల్లులను పరిశీలన కోసం ప్రభుత్వానికి తిప్పి పంపించారు..మరో రెండు బిల్లులను పెండింగ్ లో ఉంచారు.

Telangana: పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

గవర్నర్ ఉద్ధేశ పూర్వకంగానే ప్రభుత్వం పంపించిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ లో పెట్టారని వాటిని ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతు బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. పెండింగ్ బిల్లుల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి..గవర్నర్ తమిళిసైకు మధ్య వివాదం కొనసాగిన విషయం తెలిసిందే. గవర్నర్ తమిళిసైకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి గత కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం కాస్తా చిలికి చిలికి గాలివానగా మారింది. దీంతో ప్రభుత్వం పంపించిన బిల్లులను తమిళిసై ఉద్ధేశ పూర్వకంగానే ఆమోదించకుండా పెండింగ్ లో పెడుతున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Govt)ఆరోపిస్తోంది.

ఈక్రమంలో గవర్నర్ తమిళిసై మూడు బిల్లులకు ఆమోదం పలికి..రెండు బిల్లులను వెనక్కి పంపించి మరో రెండు బిల్లులను పెండింగ్ లో పెట్టటంతో ఏ బిల్లులకు గవర్నర్ ఆమోదం లభించింది.. ఏ బిల్లలను తిప్పి పంపారనే వివరాలు తెలియాల్సి ఉంది. సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ఈరోెజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విచారణకు ముందు గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది.