Telangana: పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్ కు ఉండవని అంటోంది.

Telangana: పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

Supreme Court

Telangana: తెలంగాణలో పెండింగ్ బిల్లుల విషయంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది. గవర్నర్ వద్ద ఉన్న పెండింగ్ బిల్లుల ఆమోదం కోసం రాష్ట్ర సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.

ఇందులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు. గవర్నర్ వద్ద బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం సరికాదని రాష్ట్ర సర్కారు అంటోంది. మొత్తం 10 బిల్లులు గవర్నర్ వద్ద పెండింగ్‌ లో ఉన్నాయని పేర్కొంది. దీనిపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ ఇంతకుముందే చర్చించారు.

గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని ప్రభుత్వం చెబుతోంది. ఇటువంటి విచక్షణాధికారాలు గవర్నర్ కు ఉండవని అంటోంది. రాష్ట్రానికి సంబంధించిన ఆయా బిల్లులను గవర్నర్ పెండింగ్‌ లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లులు నెలలు గడుస్తున్నా బిల్లులకు ఆమోదం లభించలేదని, దీంతో వేరే మార్గం లేకే ప్రత్యేక పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించామని తెలంగాణ ప్రభుత్వం అంటోంది.

Harish Rao : దొంగే దొంగా అన్నట్లు మోదీ మాట్లాడారు, కేసీఆర్ ఓ అద్భుత దీపం-హరీశ్ రావు