రైతు బంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? : హ‌రీశ్‌రావు కీలక వ్యాఖ్యలు

తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగు బంధం..ఆ బంధాన్ని ఎవ్వరు ఆపలేరు. రైతు బంధు వద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేయటం వల్లే ఈసీ ఆపేసిందన్నారు.

Minister Harish Rao-Rythu Bandhu : అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రైతు బంధు సాయాన్ని ఎన్నిరోజులు ఆపుతారు..? అంటూ మంత్రి హ‌రీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ఉద్ధేశ్యపూర్వకంగా ఈసీకి ఫిర్యాదులు చేసిందని.. రైతు బంధు సహాయాన్ని ఆపేలా చేసింది అంటూ మండిపడ్డారు.

నవంబర్ 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు ఇటీవల తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నిధుల పంపణి అనుమతిని ఉపసంహరించుకుంది. నంబంర్ 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తాము అంటూ ఎన్నికల ప్రచారంలో మంత్రి హ‌రీశ్‌రావు ప్రకటించటాన్ని ఈసీ ప్రస్తావించింది. ఈసీ తాజాగా చేసిన ప్రకటనపై మంత్రి హ‌రీశ్‌రావు స్పందించారు.

Also Read: రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు .. ఇదంతా కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

జహీరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతు.. రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చిందని మాత్రమే తాను చెప్పానని తెలిపారు. ఈసీకి ఫిర్యాదులు చేసి రైతుబంధు సాయాన్ని ఎన్ని రోజులు ఆపుతారు..? అంటూ కాంగ్రెస్ ను ప్రశ్నించారు. 3వ తేదీన అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సే.. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు బంధు నిధులు వస్తాయని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆ నిధులు విడుదల చేస్తారని అన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్ ది పేగు బంధం అని ఆ బంధాన్ని ఎవ్వరు ఆపలేరన్నారు. రైతు బంధు వద్దని కాంగ్రెస్ ఫిర్యాదు చేయటం వల్లే ఈసీ ఆపేసిందన్నారు.

Also Read : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

రైతు బంధు నిధులు రాకుండా చేసిన కాంగ్రెస్ కు ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. రైతు బంధు రావాలన్నా..24గంటలకు కావాలన్నా..కల్యాణ లక్ష్మీ, కేసీఆర్ కిట్ ఇలా పథకాలు ప్రజలకు అందాలంటే కాంగ్రెస్ ఖతం కావాలని..బీఆర్ఎస్ రావాలని కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే ఇవన్నీ ప్రజలకు అందుతాయని అన్నారు. కాబట్టి ప్రతీ ఒక్కరు ఆలోంచి ఓటు వేయాలని సూచించారు. ఓట్ల కోసం తాము రైతు బంధు తేలేదని.. రైతుల సంక్షేమం కోసం తెచ్చామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు