MLC Kavitha : రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు, ఇదంతా కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు అంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని.. రైతులు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

MLC Kavitha : రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు, ఇదంతా కాంగ్రెస్ కుట్ర : ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం

MLC Kavitha React on Disbursal of Rythu Bandhu

mlc kavitha rythu bandhu funds : రైతన్నల నోటి కాడి బువ్వను లాక్కున్నారు అంటూ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని.. రైతులు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎన్నికల ప్రచారంలో కవిత మాట్లాడుతు..కాంగ్రెస్ నాయకులు వెంటపడి మరీ రైతు బందును ఆపించారు అంటూ ఆరోపించారు.

కాగా..రైతు బంధు సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంటు ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 28లోపు రైతు బంధు పంపిణీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఈసీ ఇటీవల అనుమతి ఇచ్చిన తిరిగి దానిని ఉపసంహరించుకుంది. ఈ విషయంపై కవిత కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. కావాలనే కాంగ్రెస్ నేతలు ఈసీ వెంటపడి మరీ రైతుబంధును ఆపించారు అంటూ మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది అంటూ విమర్శించారు.

Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుందని ..రైతుల నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి కోరారు. బీజేపీతో బీఆర్ఎస్ కు శతృత్వం ఉందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుందని..ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలని సూచించారు.సింగరేణి ప్రైవేటీకరణ అని అంటు ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.సింగరేణి ని ప్రైవేట్ కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీయే అని ఆరోపించారు.బీజేపీ ప్రభుత్వంలో పెద్ద పెద్ద వాళ్ళే బాగుపడ్డారని అన్నారు.

కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాలు ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు..? అని ప్రశ్నించారు. ఉద్యోగాల గురించి యువత ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో మంట పెట్టాలి అని ఒక పార్టీ చూస్తుందని..కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుందని విమర్శించారు.మంచోళ్లు కావాలా ముంచే వాళ్లు కావాలా..?ఇరిగేషన్ కావాలా మైగేశన్ కావాలా..?24 గంటల కరెంటు కావాలా 3 గంటల కరెంట్ కావాలా..? అంటూ ప్రశ్నించారు.సీఎం కేసీఆర్ గల్ఫ్ కార్మికులను ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించారు అని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Revanth Reddy : ఆ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు.. ఈసీ నిర్ణయంపై రేవంత్ రియాక్షన్ ..