Revanth Reddy : ఆ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు.. ఈసీ నిర్ణయంపై రేవంత్ రియాక్షన్ ..

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. ఈసీ తాజా నిర్ణయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.

Revanth Reddy : ఆ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు.. ఈసీ నిర్ణయంపై రేవంత్ రియాక్షన్ ..

Revanth Reddy

Rythu Bandhu : కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) రైతు బంధు నిధుల విడుదలకు బ్రేక్ వేసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ రైతు బంధు సాయం పంపిణీకి గతవారం ఇచ్చిన అనుమతిని ఈసీ ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈసీ తాజాగా నిర్ణయంతో రైతు ఖాతాల్లో జమకావాల్సిన రైతు బంధు నిధులు నిలిచిపోనున్నాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు అనుమతి ఉపసంహరిస్తున్నట్లు ఈసీ ప్రకటనలో తెలిపింది. ఈనెల 28 నుంచి రైతుబంధు పంపిణీ చేస్తామన్న మంత్రి హరీశ్ రావు ప్రకటనను ఈసీ ప్రస్తావించింది. ఈసీ తాజా నిర్ణయంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు.

Also Read : Telangana Elections : రైతులకు షాకింగ్ న్యూస్.. కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. నిధుల విడుదలకు మళ్లీ బ్రేక్

రైతు బంధును అడ్డుకున్నది మామా, అల్లుళ్లే అంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావులపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ట్విటర్ వేదికగా ఈసీ ప్రకటనను ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నేతలపై రేవంత్ మండిపడ్డారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా – అల్లుళ్లకు లేదంటూ హరీశ్ రావు, కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం అని రేవంత్ అన్నారు. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదని అన్నారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందొద్దని, పదిరోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రూ.15వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.