చదువులు ఇలా ఏడిస్తే పిల్లలు ఎలా ఎదుగుతారు: టీచర్లపై హరీష్ రావు ఫైర్

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 10:07 AM IST
చదువులు ఇలా ఏడిస్తే పిల్లలు ఎలా ఎదుగుతారు: టీచర్లపై హరీష్ రావు ఫైర్

Updated On : December 28, 2019 / 10:07 AM IST

మంత్రి హరీష్ రావు ఈ రోజు (డిసెంబర్ 28, 2019)న కందిలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో మధ్యాహ్న భోజన వసతిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అసలు పిల్లలకు చదువు ఎలా చెప్తున్నరో చూద్దామని తరగతి గదులకు వెళ్లి విద్యార్ధులను పలు ప్రశ్నలు అడిగారు.

వివరాలు.. 10వ తరగతి విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లోని ప్రశ్నలు అడిగి.. వారి టాలెంట్ ని పరీక్షించారు. అయితే విద్యార్థులు తెలుగులో కూడా పేర్లు రాయకపోవడంపై హరీష్ రావు అసంతృప్తి చెందారు. ఓ విద్యార్ధిని లేపి బోర్డుపై తెలుగులో కొన్ని పేర్లు రాయమంటే అన్నీ తప్పులే రాసింది.

అంతేకాదు పదకొండో ఎక్కం రాయమంటే నాకు రాదు.. నాకు పదో ఎక్కం వరకే వచ్చిని చెప్పేసింది. దీంతో హరీష్ రావు వెంటనే 10 తరగతి కాబట్టి పది ఎక్కాలే నేర్పించారా మీ సార్ అని తల పట్టుకుని చదువులు ఇలా ఏడిస్తే… ప్రపంచంతో ఎలా పోటీపడతారని అన్నారు. చివరిగా పాఠశాల విద్యకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని, విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి ఆదేశించారు.