Minister Itala Rajender Clarified The Imposition Of Lockdown In Telangana
Itala Rajender clarified on lockdown : తెలంగాణలో లాక్‌డౌన్‌పై మరోసారి మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికైతే రాష్ట్రంలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదన్నారు. సంవత్సరకాలంగా కరోనా దేశ ప్రజలను పీడిస్తోందన్న ఈటల.. కేంద్రం ఎటువంటి ఆదేశాలిచ్చినా అమలు చేస్తామన్నారు. రాష్ట్రంపై కొందరు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆక్సిజన్, రెమ్‌డెసివర్, వ్యాక్సిన్..అన్ని చేతుల్లోనే పెట్టుకుని కేంద్రం ఇబ్బంది పెడుతోందని అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మే1 నుంచి 18 ఏళ్లు నిండినవారికి వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదన్నారు మంత్రి ఈటల. రాష్ట్రం దగ్గర సరిపడా వ్యాక్సిన్ డోస్‌లు లేవని.. కేంద్రం వాక్సిన్ డోసులను పెంచాలని కోరామని తెలిపారు. మూడో దశ వ్యాక్సినేషన్ కోసం కోటి 70 లక్షల మంది అర్హులు ఉన్నారని.. వారందరికీ 2 డోసుల వ్యాక్సిన్‌ను కేంద్రమే ఇవ్వాలన్నారు.
బెడ్స్ కొరత లేకుండా 24గంటలు ఆరోగ్యశాఖ, ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తప్పుడు ప్రచారంతో ఇబ్బంది పెటొద్దని సూచిస్తున్నామని తెలిపారు. మైల్డ్ సిమ్టమ్స్ తోనే ఎక్కువ మంది వస్తున్నారని పేర్కొన్నారు. కొందరు నిర్లక్ష్యంతో ఐసీయుకు వెళ్లే పరిస్థితి తెచ్చుకుంటున్నారని అన్నారు.
విషమంగా ఉన్నవారిని కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తున్నారని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వారు ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కొత్తగా 18సెంటర్స్‌లో కరోనా టెస్ట్‌ల కోసం ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇప్పటికే సిద్దిపేటలో ప్రారంభించామని…త్వరలో 18సెంటర్స్‌ను ప్రారంభిస్తామని చెప్పారు.