Kandikonda : గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడూ ఉంటాం – కేటీఆర్
గేయ రచయిత కందికొండకు గతంలో అండగా ఉన్నాం.. ఇప్పుడు కూడా ఉంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
- kunduru Vinod
- Updated on- December 5, 2021 / 12:23 PM IST
Kandikonda
Kandikonda : సినీ గేయ రచయిత కందికొండ కుమార్తె మాతృక రాసిన లేఖపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కందికొండ కుటుంబానికి గతంలోనూ అండగా ఉన్నామని, ఇప్పుడు కూడా ఉంటామని వెల్లడించారు. ఆయన కుటుంబం విషయంలో తన ఆఫీసు సిబ్బంది.. మంత్రి తలసానితో మాట్లాడి సాయం చేస్తారని పేర్కొన్నారు.
చదవండి : Kandikonda : చావు బతుకుల మధ్య హాస్పిటల్ లో గేయ రచయిత.. ఆదుకునేవారు లేరా??
కాగా తన తండ్రి ఆరోగ్యం సరిగా లేదని, తమ ఆర్థిక పరిస్థితి కూడా అనంత మాత్రంగానే ఉందని కందికొండ కుమార్తె మాతృక ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కు లేఖ రాసింది. తాము కిరాయి ఇంట్లో ఉంటున్నామని, తమకు చిత్రపురి కాలనీలో నివాసం కల్పించేలా చొరవ చూపాలని కందికొండ మంత్రి కేటీఆర్‌కి ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఆమె ట్వీట్‌పై స్పందించారు కేటీఆర్
చదవండి : Lyricist Kandikonda : ఆందోళనకరంగా గీత రచయిత కందికొండ ఆరోగ్యం..
