KTR : మతం పేరుతో మంట పెడుతున్నారు, 11సార్లు ఛాన్స్ ఇస్తే దేశానికి ఏం చేశారు- ప్రధాని మోదీ, సోనియా గాంధీలపై కేటీఆర్ ఫైర్

చిల్లరమల్లర రాజకీయాలు చేసేందుకే రజాకర్ సినిమా తీశారు. కర్ణాటకలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అభివృద్ధి కోసం పైసా లేదని..Minister KTR

Minister KTR (Photo : Google)

Minister KTR : విపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి కేటీఆర్. బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ, సోనియా గాంధీ టార్గెట్ గా చెలరేగిపోయారు. మతం పేరుతో మంట పెడుతున్నారు అంటూ ప్రధాని మోదీని.. 11సార్లు ఛాన్స్ ఇస్తే దేశానికి ఏం చేశారు అని సోనియా గాంధీపై ధ్వజమెత్తారు కేటీఆర్.

కేంద్రం 9 ఏళ్లలో చేసిందేమీ లేదు. మళ్ళీ గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. సెప్టెంబర్ 17 ను జాతీయ సమైక్యత దినోత్సవం చేస్తున్నా అది కేంద్ర పెద్దలకు నచ్చలేదు. పాత గాయాలు గెలికి మతం పేరుతో మంట పెడుతోంది. మోడీ సర్కార్ ఎన్నో రకాల దగా చేసింది. ఫాసిస్ట్ ధోరణితో 5 మండలాలను ఏపీ లో కలిపింది. లోయర్ సీలేరు కూడా బలవంతంగా పక్క రాష్ట్రంలో కలిపింది. బయ్యారంలో ఉక్కు కర్మాగారం అని చట్టం చేసింది. మోడీపై భ్రమలు ఒక్కొక్కటి తొలగిపోయాయి. కేసీఆర్ మేనిఫెస్టోలో చెప్పకున్నా.. రైతుబంధు అమలు చేశారు. రాష్ట్రంలో 75వేల కోట్ల రూపాయలు రైతులకు అందాయి.(KTR)

Also Read..Telangana BJP : తెలంగాణ బీజేపీ నేతల రహస్య సమావేశం, ఈటల తీరుపై తీవ్ర అసంతృప్తి.. అసలేం జరుగుతోంది?

ప్రధాని మోదీ దేశాన్ని దోచి అదానీ సంపద పెంచుతున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు అని మోడీ హామీ ఇస్తారు. కిషన్ రెడ్డి ఇక్కడ ధర్నా చేయడం కాదు.. దమ్ముంటే ఢిల్లీలో చేయాలి. చిల్లరమల్లర రాజకీయాలు చేసేందుకే రజాకర్ సినిమా తీశారు. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ పేరుతో రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏమీ చేయని మోదీ ఇలాంటి పనులు చేస్తున్నారు.

ఓవైపు దిగజారిన ప్రధాని మరో వైపు ఒక్క చాన్స్ అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామాలు. 11 సార్లు ఛాన్స్ ఇస్తే దేశానికి ఏం చేశారు? ఏదో ఒకటి చేసి అధికారం దక్కించుకునే తాపత్రయం. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క పథకమైనా అమలు చేస్తున్నారా? ఆరు గ్యారెంటీలు అంటున్న కాంగ్రెస్ లో ఎవరూ సీఎం గ్యారంటీ లేదు. కరెంట్ కష్టాలు, తాగునీటి కటకట, ఎరువుల కోసం తన్ను కోవడం, రైతు బంధుకు రాం రాం, దళిత బంధుకు జై బీమ్. కాంగ్రెస్ కు ఓటేస్తే దివాళా తీయడం పక్కా గ్యారంటీ.(KTR)

వారి హామీలు రాష్ట్ర బడ్జెట్ కంటే ఎక్కువే. మీకు అనుమానం ఉంటే కర్ణాటకలో ఎస్టీ, ఎస్టీలకు శఠగోపం పెడుతోంది. కర్ణాటకలో విద్యుత్ కోతలు మొదలయ్యాయి. అభివృద్ధి కోసం పైసా లేదని ఆ రాష్ట్ర మంత్రులే అంటున్నారు. మోడీ వచ్చినా, రాహుల్ వచ్చినా అభివృద్ది ఎవరూ కాదనలేరు. మొండి చెయ్యితో ఆరు గ్యారెంటీలు చెప్పినా అభివృద్ధి గురించి ఒక్కటి చెప్పలేదు. ప్రజలను అయోమయంలో వేసేందుకు కాంగ్రెస్ యత్నాలు. మన పార్టీ వదిలి వెళ్లి వాళ్ల బాధను ప్రజల బాధగా చెప్పుకుంటున్నారు. 40ఏళ్ళు రాజకీయాల్లో ఉండి తాగునీటిని ఎందుకు ఇవ్వలేదు?

Also Read..Chandrababu Case : చంద్రబాబు చుట్టూ బిగుస్తున్న కేసుల ఉచ్చు.. బాబు ఇక తప్పించుకోలేరా? భవిష్యత్తు ఏంటి?

ఖమ్మంలో గులాబీ జెండా ఎగిరితే నిధులు అవే వస్తాయి. ఖమ్మం ప్రజలు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాలి. కాంగ్రెస్ నేతలు ఓట్లకు డబ్బులు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. కాంగ్రెస్ నేతలు డబ్బులిస్తే తీసుకోండి. బీఆర్ఎస్ కే ఓటు వేయండి” అని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు