KTR Tweet : కేంద్రానికో ధర, రాష్ట్రాలకు మరో ధరనా?… కేంద్ర వ్యాక్సిన్ పాలసీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరలు కేంద్రానికి ఓ ధర... రాష్ట్రాలకు మరో ధర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

central vaccine policy : కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యాక్సిన్ వార్ మొదలైంది. టీకా ధరలు కేంద్రానికి ఓ ధర… రాష్ట్రాలకు మరో ధర ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాక్సిన్ తయారీ సంస్థలు.. కేంద్రానికి 150 రూపాయలకు.. రాష్ట్రాలకు 400 రూపాయలకు ఇచ్చే విధంగా వ్యాక్సిన్ పాలసీని ప్రకటించడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

జీఎస్టీ పన్నుల వసూళ్ల విషయంలో వన్ నేషన్ – వన్ ట్యాక్స్ పాలసీ అమల్లో ఉన్నప్పుడు… వ్యాక్సినేషన్ విషయంలో ఇలా ద్వంద్వ ప్రమాణాలు ఎందుకంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్స్‌ ద్వారా నిధులను సమకూర్చి.. దేశవ్యాప్తంగా ఉధృతంగా టీకా కార్యక్రమం జరిగేలా కేంద్రం చర్యలు చేపట్టవచ్చు కదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. సబ్‌కా సాత్‌…సబ్‌కా వ్యాక్సిన్‌ అంటూ కేటీఆర్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించారు.

ప్రైవేటు ఆస్పత్రులకు 600 లకు, రాష్ట్ర ప్రభుత్వాలకు 400 రూపాయలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేస్తామని కోవిషీల్డ్ ఉత్పత్తి సంస్థ సీరమ్ ఇనిస్టిట్యూట్ నిన్ననే ప్రకటించింది. ఉత్పత్తి దారుల నుంచి నేరుగా రాష్ట్రాలు టీకాలను తీసుకునే వెసులుబాటు కల్పించడంతో… ఇకపై రాష్ట్రాలు నిర్ణీత ధరలకు వ్యాక్సిన్లను కొనుక్కోవాల్సి ఉంటుంది.

మే 1 నుంచి 18 యేళ్లు పై బడిన అందరికీ వ్యాక్సిన్ అందించాలంటే… కచ్చితంగా రాష్ట్రాలకు అందుకు సరిపగా వ్యాక్సిన్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది….ధరల విషయంలో కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య తేడా ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు