ShakePet Flyover : హైదరాబాద్‌ వాసులకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. నేటి నుంచి అందుబాటులోకి షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌

షేక్‌ పేట్‌ ఫ్లై ఓవర్‌ సుదీర్ఘంగా 2.8 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్‌లో SRDP ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది.

Flyover

ShakePet flyover in Hyderabad : హైదరాబాద్‌ వాసులకు తెలంగాణ సర్కార్‌ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇస్తోంది. భాగ్యనగరంలో మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఇవాళ షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను సిగ్నల్‌ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేక్రమంలో.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో షేక్‌పేట్ ఫ్లై ఓవర్‌ ఒకటి.

షేక్‌ పేట్‌ ఫ్లై ఓవర్‌ సుదీర్ఘంగా 2.8 కిలోమీటర్ల పొడవు ఉంది. హైదరాబాద్‌లో SRDP ద్వారా చేపట్టిన ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది. ఆరు లేన్లు ఉన్న ఈ ఫ్లై ఓవర్‌ను 333 కోట్ల 55 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించారు. షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ను నూతన సంవత్సర కానుకగా ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. షేక్‌ పేట్ ఫ్లై ఓవర్‌ సెవన్‌ టూంబ్స్‌ జంక్షన్‌, ఫిల్మ్‌ నగర్‌ రోడ్ జంక్షన్‌, ఓయూ కాలనీ జంక్షన్‌, విస్పర్‌ వేలీ జంక్షన్ల మీదుగా వెళుతుంది. దీంతో ఈ రూట్‌లోని ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

New Year Celebrations : వెల్‌కమ్ 2022.. బైబై 2021 : తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్

SRDPలో భాగంగా మొత్తం 8 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 47 అభివృద్ధి పనులు చేపట్టింది ప్రభుత్వం. ఇందులో రెండు వేల కోట్ల రూపాయల విలువైన ఫ్లై ఓవర్‌ ప్రాజెక్టులు, అండర్‌ పాస్‌లు, ఆర్‌వోబీలు, ఆర్‌యూబీలు ఉన్నాయి. 23 పనులు పూర్తయ్యాయి. 6 వేల కోట్ల రూపాయల విలువైన మరో 24 పనులు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి.