Minister Malla Reddy : రియల్టర్‌కు మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు
ఓ రియల్టర్‌కు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. వెంచర్ వేసిన తర్వాత కలవాలని తెలీదా అంటూ మహేందర్ అనే రియల్టర్‌ను మంత్రి బెదిరించారు.

Minister Malla Reddy
Minister Mallareddy threatens realtor : ఓ రియల్టర్‌కు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. వెంచర్ వేసిన తర్వాత కలవాలని తెలీదా అంటూ మహేందర్ అనే రియల్టర్‌ను మంత్రి బెదిరించారు. సర్పంచ్‌కు డబ్బులిస్తే సరిపోతుందా.. అంటూ వార్నింగ్ ఇచ్చారు. నన్ను కలిసి డబ్బులు ఇచ్చేదాకా వెంచర్ పనులు ఆపేయాలని హెచ్చరించారు మంత్రి మల్లారెడ్డి. మహేందర్ అనే రియల్టర్ 50 ఎకరాల స్థలంలో వెంచర్ వేశారు. ఇదే ఇప్పుడు బెదిరింపులకు కారణమైంది.
ఇప్పటివరకు మంత్రి మీడియాకు అందుబాటులోకి రాలేదు. ఈ వ్యవహారం వివాదాస్పదంగానే ఉందని చెప్పవచ్చు. మల్కాజ్ గిరి నియోజకవర్గపరిధిలో 50 ఎకరాల వెంచర్ కు సంబంధించిన విషయంలో రియల్టర్ కు మంత్రి బెదిరింపులకు పాల్పడ్డారు. నేరుగా అతినికి ఫోన్ చేసి, వెంచర్ కు సంబంధించి గ్రామ సర్పంచ్ క డబ్బులు ఇస్తే సరిపోతుందా..నేను ఉన్నానన్న సంగతి తెలియదా.. అంటూ మంత్రి మల్లారెడ్డి రియల్టర్ కు వార్నింగ్ ఇచ్చారు.
రెండు రోజుల తర్వాత వచ్చి కలుస్తామని రియల్టర్ చెప్పగా, అప్పటివరకు వెంచర్ పనులు ఆపివేయాలని, తనను కలిసిన తర్వాతనే వెంచర్ పనులు చేయాలంటూ మంత్రి హుకుం జారీ చేశారు. మొత్తానికి చూస్తే చాలా విషయాల్లో కాంట్రవర్సీగా ఉండే మల్లారెడ్డి మరోసారి వివాదాస్పద అంశంలో చిక్కారని చెప్పవచ్చు.