ఈ ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతోంది: పొన్నం ప్రభాకర్‌

పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

Minister Ponnam Prabhakar

కొత్త రేషన్‌ కార్డుల జారీపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరిన్ని వివరాలు తెలిపారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ కోసం గ్రామాల్లో సర్వే జరుగుతోందని అన్నారు. 2 కోట్ల 81 లక్షల మందికి ఇప్పటికే తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని వివరించారు.

రేషన్‌ కార్డులపై ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగానే రాద్ధాంతం చేస్తున్నాయని పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్ కార్డు అర్హత ఉండి రాకుంటే సంబంధిత అధికారికి, ప్రజా ప్రతినిధులకు విజ్ఞాపన పత్రాలు ఇవ్వచ్చని చెప్పారు.

పాత రేషన్ కార్డులను తొలగించడం లేదని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కుల సర్వే ఆధారంగా, అప్లికేషన్ల సమాచారం ఆధారంగా కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు వస్తాయని తెలిపారు. ఇందుర్తి మండల ప్రతిపాదనలు పంపామని తెలిపారు.

రాష్ట్రంలో కొత్త మండలాలు ఏర్పడినప్పుడు ఇందుర్తి మండలం ఏర్పడుతుందని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాగా, రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ప్రభుత్వం మార్గదర్శకాలను ఇప్పటికే విడుదల చేసింది. జనవరి 26 నుంచి కార్డులు జారీ కానున్నాయి. క్యాబినెట్ ఉపసంఘం సిఫారసులకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

ఆసక్తిరేపుతోన్న టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థి ఎంపికపై కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్..!