ఆసక్తిరేపుతోన్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు.. అభ్యర్థి ఎంపికపై కన్ఫ్యూజన్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్..!
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి.

MLC election heat in North Telangana
Gossip Garrage : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్తర తెలంగాణ పాలిటిక్స్‌ను హీటెక్కిస్తున్నాయి. బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించి ఊపు క్రియేట్ చేసింది. అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ కన్ఫూజన్‌లో ఉంది. టీచర్ ఎమ్మెల్సీపై బీఆర్ఎస్ ఉలుకు పలుకు లేదు. కానీ కేయూ కేంద్రంగా సామాజిక సంస్థలు, విద్యారంగంలోని అసోషియేషన్లు అనూహ్యమైన అడుగులు వేశాయి. సబ్బండ వర్గాల మద్దతుతో ఓ ఉద్యమకారుడు సమరానికి సైఅంటున్నారు. దీంతో ఉపాధ్యాయ సంఘాల్లో ఆ కటౌట్ హాట్ టాపిక్ అవుతుంది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంతో పాటు, కరీంనగర్-ఆదిదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్ మరియు గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలకు రేపోమాపో నగారా మోగనుంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల MLC స్థానం 191 మండలాల పరిధిలో విస్తరించి ఉంది. 24వేల 905 మంది టీచర్లు ఓటర్లుగా ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా ప్రకటించగా..అధికార కాంగ్రెస్ మాత్రం ఎవరికి మద్దతు తెలపాలి..పోటీ చేయాలా.? వద్దా అనే డైలమాలో ఉందట. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రం టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్చ లేకుండా పూర్తిగా సైలెంట్‌గా ఉంది.
KCR survey report : కాంగ్రెస్ పాలనపై కేసీఆర్ సర్వే రిపోర్ట్ ఏం చెబుతోంది.?
వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికపై బీఆర్ఎస్ వ్యూహమేంటో అంతు చిక్కడం లేదు. కాంగ్రెస్ వేచి చూసే ధోరణితో వ్యహరిస్తోంది. అయితే వారం రోజుల నుంచి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని ఉపాధ్యాయ సంఘాల యాక్టివిటీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పార్టీలు వ్యూహాత్మకంగా ఉన్నప్పటికీ..కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా ఉండే సామాజిక సంస్థలు, కుల సంఘాలు, విద్యారంగంలోని వివిధ అసోషియేషన్లు కీలక నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాయి.
2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తున్న వ్యక్తిగా, ప్రతిష్టాత్మక కాకతీయ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్‌గా విద్యారంగంలో మంచి సంబంధాలున్న సంగంరెడ్డి సుందర్ రాజ్‌యాదవ్‌పై ఉపాధ్యాయ సంఘాలు ఫోకస్ చేశాయి. గతంలో కాకతీయ అర్భన్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్‌గా పనిచేశారు రాజ్ యాదవ్. బీసీ సామాజిక ఉద్యమాల్లో రాష్టస్థాయి నేతగా ముద్రపడిన సుందర్ రాజ్ యాదవ్ అయితే..టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరైన క్యాండిడేట్ అని భావిస్తున్నారు. ఆయన కూడా పోటీ చేయాలని డిసైడ్ అయినట్లు ప్రకటించారు. విద్యావేత్తగా, సామాజిక ఉద్యమ నేతగా, తెలంగాణ ఉద్యమకారుడిగా ఉన్న సుందర్ రాజ్ యాదవ్ రేసులోకి రావడంతో వరంగల్ కేంద్రంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు హీటెక్కుతున్నాయి.
BRS Moves Supreme Court : సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్.. పార్టీ ఫిరాయింపులపై పిటిషన్.. ఏం జరగనుంది?
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఉద్యమకారుడిగా, తన విద్యాసంస్థలనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి అడ్డగా మార్చిన నాయకుడిగా సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్‌కు గుర్తింపు ఉంది. కుడా చైర్మన్‌గా పనిచేయడంతో వివిధ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గతంలో సుందర్ రాజ్ యాదవ్‌కు రాజ్యసభ సీటు దక్కినట్లే దక్కి చేజారింది. రెండుసార్లు ఇదే వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం రావడం చివరి నిమిషంలో గులాబీబాస్ కేసీఆర్ సర్ధిచెప్పడంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచే బలమైన గొల్ల కురుమ సామాజిక వర్గం నుంచి సంగంరెడ్డి సుందర్ రాజ్‌యాదవ్ పేరు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటివరకు తనకు ఏ రాజకీయ పార్టీని మద్దతు అడగ లేదని, ప్రస్తుతానికి సబ్బండ వర్గాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగానే టీచర్ ఎమ్మెల్సీగా బరిలోకి దిగుతున్నానంటున్నారు సుందర్ రాజ్ యాదవ్. అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది.? బీఆర్ఎస్ అభ్యర్థిని బరిలోకి దింపుతుందా.? లేక ఎవరికైనా మద్దతు ఇస్తుందా అనేది ఆసక్తిని రేపుతోంది. నోటిపికేషన్ వస్తే పార్టీల స్టాండ్ ఏంటో స్పష్టం కానుంది.