Minister Seethakka
Minister Seethakka: సినీహీరో అల్లు అర్జున్ అరెస్టుపై మంత్రి సీతక్క స్పందించారు. అల్లు అర్జున్ పై మాకు ఎలాంటి కక్ష్య లేదని అన్నారు. ఆయన అరెస్టు ప్రక్రియ చట్టానికి లోబడే జరిగిందని, చట్టం ఎవరికి చుట్టం కాదని అన్నారు. ఎవరం ఈ విషయంలో జోక్యం చేసుకోలేదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ భార్య బంధవులే. మెగాస్టార్ చిరంజీవిసైతం కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. కక్ష్య పెట్టుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ నేతలకు లేదని సీతక్క అన్నారు.
Also Read: Mohan Babu : నేనెక్కడికి పారిపోలేదు.. తప్పుడు ప్రచారం చేస్తున్నారు : మోహన్ బాబు
ఇదిలాఉంటే.. అల్లు అర్జున్ అరెస్టుపై రాజకీయ దుమారం రేగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ ను కావాలనే అరెస్టు చేసిందని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ అరెస్టుపై సీఎం రేవంత్ రెడ్డిసైతం స్పందించారు. దేశంలో గతంలో సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ వంటి అనేక మంది కూడా అరెస్ట్ అయ్యారని, సెలబ్రిటీ అయినంత మాత్రాన చట్టానికి అతీతులు కాదని అన్నారు. సినిమా విడుదల వేళ రూ. 300 టికెట్ ను రూ. 1300 చేసి బెనిఫిట్ షో చేశారని, బెనిఫిట్ షో తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయారని గుర్తు చేశారు.
సినిమా హాల్ వాళ్లను అరెస్ట్ చేశారని, 10రోజుల తరువాత అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని అన్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వెళ్లడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అల్లు అర్జున్ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని చెప్పిన సీఎం.. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే అడుగుతున్నారని, చనిపోయిన మహిళ, ఆమె కుమారుడి గురించి ఎవరూ అడగడం లేదని అన్నారు.