×
Ad

Minister Sridhar Babu: సీబీఐ మీద రాహుల్ గాంధీకి లేని నమ్మకం.. మీకెలా? 10టీవీ పాడ్‌కాస్ట్‌లో మంత్రి శ్రీధర్ బాబు ఏమన్నారంటే..

సీబీఐ, ఈడీ, ఐటీ లాంటివి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అని రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమో సీబీఐ అంటున్నారు.

Minister Sridhar Babu: తెలంగాణలో పలు కీలక కేసుల దర్యాఫ్తును రేవంత్ సర్కార్ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. ఓవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కేంద్ర దర్యాఫ్తు సంస్థలు సీబీఐ, ఈడీ, ఐటీ పై తనకు నమ్మకం లేదని అంటున్నారు. మరి రేవంత్ సర్కార్ కి సీబీఐ నమ్మకం ఎలా కలిగింది? దీనిపై 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో మంత్రి శ్రీధరబాబు ఏమన్నారంటే..

ప్రశ్న: కాళేశ్వరం ప్రాజెక్ట్ పై కమిషన్ వేశారు. దాదాపు ఏడాదిన్నర పని చేసింది. 665 పేజీల రిపోర్ట్ కూడా ఇచ్చింది. అసెంబ్లీలో చర్చించారు కూడా. చివరికి దాని మీద ఏదో చర్యలు తీసుకుంటారు, లేదంటే విచారణ చేస్తారు అని అంతా అనుకుంటే మీరేమో సీబీఐ చేతిలో పెట్టారు. ఆ పని ముందే చేయొచ్చు కదా.. సీబీఐ, ఈడీ, ఐటీ లాంటివి అపోజిషన్ ఎలిమినేషన్ సెంటర్లు అని రాహుల్ గాంధీ చెప్పారు. మీరేమో సీబీఐ అంటున్నారు. బీఆర్ఎస్ ను ఎలిమినేట్ చేయడానికి సీబీఐని వాడుతున్నారా?

” కాళేశ్వరం కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో పెట్టి అందరితో సమాలోచన చేశాకే సీబీఐకి ఇవ్వటం జరిగింది. ఏదైనా దర్యాఫ్తు సంస్థ ద్వారా ప్రభుత్వం విచారణ చేస్తే దాన్ని రాజకీయ కక్ష సాధింపు అనే వారు. అందుకే, కరెక్ట్ గా దర్యాఫ్తు జరగాలి అనే ఉద్దేశ్యంతోనే సీబీఐకి అప్పగిచ్చాం. రాహుల్ గాంధీ నాడు జరిగిన అనేక సంఘటనలతో కేంద్ర దర్యాఫ్తు సంస్థల గురించి అలా చెప్పారు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది.

అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఆ అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లాం. ప్రజలకు సంబంధించిన అభిప్రాయం ప్రజాప్రతినిధితో వస్తుంది కనుక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తీసుకునే ఈరోజు సీబీఐ విచారణకు మేము నిర్ణయించాం. కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలనే అభిప్రాయంతో సీబీఐకి అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Also Read: ఆరు గ్యారెంటీలు ఆలస్యం కావడానికి కారణం ఇదే- 10టీవీ పాడ్ కాస్ట్ లో మంత్రి శ్రీధర్ బాబు..