Minister Sridhar Babu: ఆరు గ్యారెంటీలు ఆలస్యం కావడానికి కారణం ఇదే- 10టీవీ పాడ్ కాస్ట్ లో మంత్రి శ్రీధర్ బాబు..
ఇతరుల మాదిరి వాగ్దానాలు ఇచ్చి మేము వెనక్కి పోలేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మాది.

Minister Sridhar Babu: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధానమైన కారణాల్లో ఒకటి ఆరు గ్యారెంటీలు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఓటర్లను అట్రాక్ట్ చేశాయి. కాంగ్రెస్ వైపు వెళ్లేలా చేశాయి. మరి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇంకా ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదు. ఆరు గ్యారెంటీలను ఎందుకు ఆలస్యం అవుతున్నాయి? దీనికి కారణం ఏంటి? ఆరు గ్యారెంటీలు ఎప్పుడు పూర్తి చేస్తారు? 10టీవీ వీకెండ్ పాడ్ కాస్ట్ లో దీనిపై మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు ఆలస్యం కావడానికి కారణం ఏంటో ఆయన వివరించారు.
”రాబడి ఏ విధంగా ఉంది, ఖర్చు ఏ విధంగా ఉంది అనే దానిపై వైట్ పేపర్ రిలీజ్ చేశాం. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే వైట్ పేపర్ రిలీజ్ చేశాం. ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాం. రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక దుస్థితికి గత ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు, కార్యక్రమాలు అని వివరించాం. ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా ఒక కార్యాచరణ తీసుకున్నాం. ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఇతరుల మాదిరి వాగ్దానాలు ఇచ్చి మేము వెనక్కి పోలేదు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత మాది. తప్పకుండా తీరుస్తాం” అని 10టీవీ పాడ్ కాస్ట్ లో మంత్రి శ్రీధర్ బాబు తేల్చి చెప్పారు.
”గత ప్రభుత్వం తీసుకున్న అప్పులపై మేము వడ్డీ చెల్లిస్తున్నాం. వడ్డీలకే 7వేల కోట్లు పోతోంది. మేము వచ్చాక ఇప్పటివరకు ఎవరిపైనా ట్యాక్సులు వేయలేదు. కరెంట్ బిల్లులు పెంచలేదు. ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదు. సామాన్య ప్రజానీకంపై భారం పడేలా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. పాత పెండింగ్ బిల్స్ కు సంబంధించిన అంశం చాలా పెద్ద సమస్య. రాజకీయంగా ఏదో రచ్చ చేయాలనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రాక్టర్లను పంపిస్తున్నారు. ధర్నాలు చేయిస్తున్నారు. మీడియా ద్వారా సత్యదూరమైన ప్రచారం చేయడానికి రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారు. పెండింగ్ బిల్స్ చెల్లించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు గత 22 నెలల నుంచి ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లిస్తున్నాం” అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
Also Read: రేపే.. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు..