MLA Aadi Srinivas: 18ఏళ్లుగా న్యాయపోరాటం చేశా.. చెన్నమనేని పిటిషన్ డిస్మిస్‌పై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

18ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి చెన్నమనేనిపై గెలిచాను. న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉండడం వల్లే ఓపిగ్గా పోరాటం చేశాను.

Chennamaneni Ramesh MLA Aadi Srinivas

Chennamaneni Ramesh: వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కు తెలంగాణ హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తప్పుడు సమాచారంతో ఎన్నికల్లో పోటీ చేశారంటూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆది శ్రీనివాస్ గతంలో చెన్నమనేని రమేశ్ కు వ్యతిరేకంగా ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లు ఈ పిటిషన్ పై వాదనలు జరుగుతున్నాయి. అయితే, తనను భారతీయుడుగా గుర్తించాలని ఆయన వేసిన పిటిషన్ పై సోమవారం హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. చెన్నమనేని రమేశ్ జర్మనీ పౌరుడేనని తేల్చింది. తప్పుడు డాక్యుమెంట్లతో గత 15ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించారని పేర్కొంటూ ఆయనకు రూ. 30లక్షలు జరిమానాను హైకోర్టు విధించింది. వాటిలో 25 లక్షలు పిటిషనర్ అయిన వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు, రూ. 5లక్షలు లీగల్ సెర్వీసెస్ అథారిటీకి నెలలోపు చెల్లించాలని ఆదేశించింది.

Also Read: Manchu Family : మంచు ఫ్యామిలీలో కొన‌సాగుతున్న హైడ్రామా.. మోహన్‌బాబు ఇంటికి చేరుకున్న బౌన్స‌ర్లు..

చెన్నమనేనిపై హైకోర్టు తీర్పు తరువాత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 10టీవీతో మాట్లాడారు. చెన్నమానేని రమేష్ న్యాయ స్థానాన్ని తప్పుదోవ పట్టించాడని, 45సార్లు జర్మనీ పాస్‌పోర్ట్ మీద ప్రయాణం చేసినట్లు ఆధారాలను, జర్మనీలో ఓసీఏ కార్డును పొడిగించాలని దరఖాస్తు పెట్టుకున్న ఆధారాలను కోర్టుకు సమర్పించామ‌ని తెలిపారు. జర్మనీ పౌరసత్వం కలిగి చెన్న‌మ‌నేని ఇండియాలో ఎమ్మెల్యే అయ్యాడని, చట్టాన్ని ఉల్లంఘించాడు కాబట్టే న్యాయస్థానంలో పోరాటం చేసి గెలిచాన‌ని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. జర్మనీలో పెట్టుకున్న దరఖాస్తులు గతంలో ఇండియన్, ప్రస్తుతం జర్మనీ పౌరసత్వం కలిగినట్లు అతను దరఖాస్తు పెట్టుకున్నాడు. భారతదేశ ప్రభుత్వాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తప్పుడు పత్రాలు సమర్పించి ఎమ్మెల్యేగా గెలిచాడు. మరోవైపు న్యాయస్థానాలను కూడా తప్పుదోవ పట్టించేలా వ్యవహరించాడు. చిన్నమనేని రమేష్ పైన పోరాటం చేస్తుంటే నాపైన ఆయన అనుచరులు కేసులు పెట్టి జైలు కు పంపాలని ప్రయత్నం చేశార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు.

Also Read: Revanth Reddy: తెలంగాణ తల్లి రూపురేఖలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

18ఏళ్ల పాటు న్యాయపోరాటం చేసి చెన్నమనేనిపై గెలిచాను. న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉండడం వల్లే ఓపిగ్గా పోరాటం చేశాను. ఈరోజు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను. వేములవాడ నియోజకవర్గం అభిృద్ధిలో వెనుక పడడానికి ప్రధాన కారణం చెన్నామనేని రమేశ్‌. కేవలం ఎమ్మెల్యే అనే పదవిని కుటుంబం అడ్డుపెట్టుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు చెన్నమనేని ర‌మేశ్‌కు చెంప‌ చెల్లుమనేలా అనిపించింది. త‌న‌ను భారతీయుడుగా గుర్తించాలని రమేశ్‌ వేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇప్పటికైనా న్యాయం గెలిచిందని నేను భావిస్తున్నాను అని పిటిష‌న‌ర్‌, ఎమ్మెల్యే ఆది శ్రీ‌నివాస్ పేర్కొన్నారు.