Kaushik Reddy : ఈటల రాజేందర్ ఎంతో మంది చావులకు కారకుడయ్యాడు : ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి
చెల్పూరు సర్పంచ్ వేధింపులతో చావు బతుకుల మధ్య ఉన్న మహిళలను ఈటల ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు. ఈటల జైలుకి పోయి నేరస్తుడిని మాత్రం పరామర్శించాడని విమర్శించారు.
- bheemraj
- Published On : April 17, 2023 / 07:13 PM IST
Kaushik Reddy
Kaushik Reddy : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెల్పూరు సర్పంచ్ మహేందర్ గౌడ్ అరెస్టుకు నిరసనగా ఈటల చేసిన దీక్షను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి విమర్శలు చేశారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు పిచ్చి లేచినట్లు అనిపిస్తోందన్నారు. ఈటల ధర్నా ఎందుకు చేసినట్లని ప్రశ్నించారు. చెల్పూరు సర్పంచ్ వేధింపులతో చావు బతుకుల మధ్య ఉన్న మహిళలను ఈటల ఎందుకు పరామర్శించలేదని నిలదీశారు.
ఈటల జైలుకి పోయి నేరస్తుడిని మాత్రం పరామర్శించాడని విమర్శించారు. ఈటల రాజేందర్ ఎంతో మంది చావులకి కారకుడయ్యాడని తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. బీజేపీ సర్పంచ్ లు ప్రజలను ఎంతో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ‘నేను కూడా అరేయ్ రాజేంద్రా! అని అనొచ్చు కానీ నాకు సంస్కారం అడ్డొస్తుంది అని అన్నారు.
గుడ్లు ఏరుకునే వ్యక్తిని తీసుకొచ్చి ఎన్నో పదవులు ఇస్తే … కేసీఆర్ ని అరేయ్, ఒరేయ్, సైకో అని ఈటల అనొచ్చునా..? అని ప్రశ్నించారు. ఈటల సవాల్ ని స్వీకరిస్తున్నా… తేదీ ఫిక్స్ చేయండి వస్తానని ఛాలెంజ్ చేశారు. బీజేపీలో ఉన్న వ్యక్తులు బీఆర్ఎస్ లోకి రానున్నారని జోస్యం చెప్పారు.
