MLA Raja singh : నాకున్న మెంటల్‌కి ఏ పార్టీ సెట్ కాదు బీజేపీ తప్ప : రాజాసింగ్
ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలోకి వెళ్తున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కనున్నారా? జైలుకు వెళ్లాక రాజాసింగ్ ను బీజేపీ పట్టించుకోకపోవటం..ఏకం సస్పెండ్ చేయటమే రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారా?

mla rajasingh
MLA Rraja singh : వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకు కూడా వెళ్లి వచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ టీడీపీలోకి వెళ్తున్నారా? బీజేపీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కనున్నారా? జైలుకు వెళ్లాక రాజాసింగ్ ను బీజేపీ పట్టించుకోకపోవటం..ఏకం సస్పెండ్ చేయటమే రాజాసింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారా? ఇక రాజాసింగ్ టీడీపీ గూటికి చేరుకున్నారా? అనే వార్తలపై రాజాసింగ్ స్పందించారు. నాకున్న మెంటల్ కు నాకు ఏ పార్టీ సెట్ అవ్వదని కాబట్టి నేను టీడీపీలోకి వెళ్తున్నాననే మాటల్లో ఏమాత్రం వాస్తవంలేదని స్పష్టంచేశారు.
బిజెపి పార్టీ నన్ను సస్పెండ్ మాత్రమే చేసింది పార్టీ నుండి తీసివేయలేదని..తెలగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ,కేంద్ర మంత్రులు అందరూ నాకు మద్దతుగా ఉన్నారని అటువంటిది నేను టీడీపీలోకి వెళ్లటమేంటీ? ఇటువంటి వార్తలు నమ్మొద్దు అసలు నాకున్న మెంటల్ కు నాకు బీజేపీ తప్ప ఏ పార్టీ సెట్ కాదు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్. నిన్న కూడా కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ కార్యక్రమంలోనే పాల్గొని వచ్చాను దీనికంటే ఇంకేం కావాలి నన్ను బీజేపీ పార్టీ నుంచి తీసివేయలేదు అని చెప్పటానకి అంటూ చెప్పుకొచ్చారు.
నేను బీజేపీలోనే ఉంటా వచ్చే ఎన్నికల్లో కూడా బీజేపీ తరపునే గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటూ స్పష్టంచేశారు. బీజేపీ నాపై సస్పెన్షన్ ఎత్తివేయకపోతే రాజకీయాలకు దూరంగా ఉంటాను ధర్మ కార్యక్రమాలను చేసుకుంటాను
తప్ప ఏ పార్టీలోనే చేరను అని సుస్పష్టంగా తెలిపారు రాజాసింగ్.
ఈ సందర్భంగా చంద్రబాబు గురించి కూడా రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని..కానీ తెలంగాణలో టిడిపికి ఆ పరిస్థితి లేదు అని అన్నారు. పార్టీ మారాలని ఆలోచన ఉంటే.. ముగ్గురు ఎమ్మెల్యేలు కాదు వంద మంది ఎమ్మెల్యేలను పెట్టే సత్తా నాకు ఉంది అంటూచెప్పుకొచ్చారు రాజాసింగ్.