MLC Kavitha : 22 కార్లు విజయవాడలో దాచారన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కవిత రియాక్షన్..

ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు.

BRS MLC Kavitha

BRS MLC Kavitha : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వయిరీ చేస్తున్నారని.. కానీ, మంత్రులు విమర్శలు చేయడం వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. శనివారం ఆమె హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో పోటీ చేయకపోవడం పార్టీ నిర్ణయమని చెప్పారు. దక్షిణాది కుంభమేళా మేడారం సమ్మక్క సారక్క జాతర మన తెలంగాణలో ఉండటం గర్వకారణంమని, సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా కల్పించాలని ప్ర‌జ‌ల ప‌క్షాన కేంద్ర ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.

Also Read : CM Revanth Reddy : రైతు భరోసా, పెన్షన్లపై అపోహలొద్దు.. కొత్తవారే దరఖాస్తు చేసుకోవాలి

ఉచిత బస్సు పథకం వల్ల ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని, మేడారం జాతరకు వచ్చే పురుషులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని కవిత ప్రభుత్వానికి సూచించారు. పెన్షన్ వస్తున్న వారికి జనవరి 1 నుంచి పెన్షన్ పెంచి యథావిధిగా ఇవ్వాలని కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని వివరాలు అడుగుతున్నారు కానీ, బ్యాంకు వివరాలు అడగడం లేదని, బ్యాంక్ వివరాల పేరుతో మరికొద్ది రోజులు టైం పాస్ చేసే ప్లానే ఇదంటూ కవిత ఆరోపించారు. నిరుద్యోగ భృతిపై ఫామ్ లో అడగలేదని, ఎఫ్ఐఆర్ లేకుండా ఉద్యమాలు చేసిన వారి పరిస్థితి ఏంటని కవిత ప్రశ్నించారు. 200 యూనిట్స్ తక్కువ బిల్లు ఉన్న వారెవరూ బిల్లు కట్టకపోతే మంచిదని కవిత అన్నారు. మీ సేవాలో ప్రజల పూర్తి డేటా ఉందని, కేవలం కాలయాపన కోసమే దరఖాస్తులను కాంగ్రెస్ ప్రభుత్వం స్వీకరిస్తున్నదని కవిత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనపై విమర్శలు చేశారు.

Also Read : షర్మిలతోనే నా ప్రయాణం.. సీఎం జ‌గ‌న్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బాబుపై నా పోరాటం ఆగదని వెల్లడి

కార్లు కొనడం ప్రభుత్వ భద్రతకు సంబంధించిన విషయంఅని కవిత అన్నారు. ప్రజాప్రతినిధుల కాన్వాయ్ ఎక్కడ ఉంచాలి.. ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఇంటలిజెన్స్, సెక్యూరిటీ సీక్రెట్స్ కు సంబధించిన విషయం అన్నారు. 22 కార్లు విజయవాడలో దాచారని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన స్థాయికి తగదని కవిత పేర్కొన్నారు.