షర్మిలతోనే నా ప్రయాణం.. సీఎం జగన్‌పై ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బాబుపై నా పోరాటం ఆగదని వెల్లడి
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎఆర్ కుటుంబానికి భక్తుడిని అని, షర్మిల వెంటే తన ప్రయాణం అని స్పష్టం చేశారు.

Alla Ramakrishna Reddy
Alla Ramakrishna Reddy: : మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ఆర్ కుటుంబానికి భక్తుడినని, షర్మిలవెంటే తన ప్రయాణం ఉంటుందని చెప్పారు. షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్లేది నిజమేఅయితే ఆమె వెంట కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు నేను సిద్ధమని, తిరిగి మళ్లీ వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే అవకాశం లేదని అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read : Tirumala : తిరుమలలో మరోసారి చిరుత, ఎలుగుబంటి సంచారం.. నడక మార్గంలోని భక్తులకు టీటీడీ కీలక సూచనలు
మంగళగిరి నియోజకవర్గాన్ని రూ. 1200 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి రూ. 120 కోట్లే కేటాయించారని ఆళ్ల అన్నారు. మంగళగిరి అభివృద్ధికి నిధులు విడుదల కాలేదని, రూ. 8కోట్ల వరకు అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు ఇచ్చానని ఆర్కే పేర్కొన్నారు. నా సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేశా.. లోకేశ్ ను ఓడించిన నాకు సహకారం అందించకపోతే ఎలా అంటూ ఆర్కే సీఎం జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. నా రాజీనామా ఆమోదించక పోవడం అనేది వాళ్ల ఇష్టం.. నేను మాత్రం స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని ఆళ్ల అన్నారు. నా వ్యాఖ్యలకు సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానన్న ఆర్కే.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకోనని అన్నారు. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా నా పోరాటం ఆగదు.. వైసీపీ ప్రభుత్వం తప్పుచేస్తే కేసులు వేసేందుకు వెనకాడనని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు.
Also Read : Chandrababu Naidu : తిరుగుబాటు మొదలైంది.. 175 స్థానాలు మనవే- చంద్రబాబు నాయుడు
వైఎస్ఆర్ సీపీకి నేను ఎంతో సేవచేశా.. సర్వస్వం పోగొట్టుకున్నానని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీకి సిద్ధాంతాలు ఉండాలి.. ఎంచుకున్న అభ్యర్థులను ఓడించాలంటే ఆ నియోజకవర్గం పరిధిలో అభివృద్ధి చేయాలని అన్నారు. నాకు జగన్ టికెట్ ఇవ్వడం లేదని వైసీపీని వీడలేదు.. నాకు, చిరంజీవికి, జగన్ మధ్య ఏం జరిగిందనే విషయం అందరికీ తెలుసని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలాఉంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవలే వైసీపీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా చేసినాటి నుంచి ఏ పార్టీలో చేరుతారనే అంశం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రామకృష్ణారెడ్డి ఆ విషయంపై క్లారిటి ఇచ్చినట్లయింది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇస్తున్నారని ప్రచారం జరుతున్న వేళ షర్మిల వెంటే నా ప్రయాణం అంటూ ఆర్కే చెప్పారు.