Site icon 10TV Telugu

MLC Kavitha: బీఆర్ఎస్ నేతలపై కవిత షాకింగ్ కామెంట్స్.. ఢిల్లీలో రేవంత్, చంద్రబాబు భేటీపై ఫైర్

MLC Kavitha

MLC Kavitha

MLC Kavitha: తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కవితల మధ్య వార్ తెలంగాణ పాలిటిక్స్ ను హీట్ పెంచింది. కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతల నుంచి, ఆ పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ విషయంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. గురువారం మీడియాతో చిట్ చిట్ లో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు.

తీర్మాన్ మల్లన్న నాపై చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నాయకులు స్పందించక పోవటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని కవిత అన్నారు. ఇదే సమయంలో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశంపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్ పై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కరెక్టేనని కవిత చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు ఆర్డినెన్స్ వద్దని చెప్పడం సరికాదు.. వాళ్లు నా దారికి రావాల్సిందే. అయితే, నాలుగు రోజులు టైం తీసుకుంటారు కాబోలు.. అంటూ కవిత అన్నారు. 2018 చట్ట సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే. నేను న్యాయనిపుణులతో చర్చించిన తర్వాతే ఆర్డినెన్స్ కు సపోర్టు చేశానని కవిత పేర్కొన్నారు.

ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీపై కవిత స్పందించారు. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి.. ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పండుగ వాతావరణం కనిపించిందని అన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ పౌరుషం లేకుండా చంద్రబాబు చేతిలో గోదావరి జలాలు అప్పనంగా అప్పజెప్పి వచ్చారు. చంద్రబాబును సన్మానం చేస్తుంటే రేవంత్ రెడ్డి మొహం వెలిగిపోయింది.
బనకచర్ల వల్ల ఏపీకి కూడా లాభం లేదు. కుట్ర పూరితంగా కాంట్రాక్టర్ల కోసం ఆ ప్రాజెక్టును చేపడుతున్నారని కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దారుణంగా మోసం చేస్తున్నాయి. బనకచర్లను తక్షణమే ఆపాలి. లేదంటే జాగృతి న్యాయ పోరాటం చేస్తుంది. బీసీ రిజర్వేషన్లు, బనకచర్లపై అభిలపక్షాన్ని సీఎం ఢిల్లీకి తీసుకెళ్లాలని కవిత డిమాండ్ చేశారు.

Exit mobile version