MLC Kavitha : కేసీఆర్ తాతకు ఓటేస్తానంటూ మారాం చేసిన చిన్నారి.. క్యూట్ వీడియో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

పసివయసులో పిల్లల డిమాండ్లు చూస్తే ముచ్చట అనిపిస్తుంది. చిన్నారి అమేయ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎమ్మెల్సీ కవిత ఆ వీడియోను షేర్ చేసారు.

MLC Kavitha

MLC Kavitha : చిన్నపిల్లలు చేసే మారాం చూస్తుంటే భలే ముచ్చటేస్తుంది. ఓ చిన్నారి కేసీఆర్ తాతకు ఓటేస్తానంటూ ఏడుస్తుంటే ఆమె తల్లి బుజ్జగిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Uttar Pradesh : జీన్స్,టీ షర్ట్ ధరించాలని అత్తగారు వేధిస్తోంది అంటూ కోడలు ఫిర్యాదు

చిన్నపిల్లలు ఒక్కోసారి ఆరిందాలాగ వ్యవహరిస్తారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్నట్లు మాట్లాడేస్తారు. వాళ్ల మాటలకి పేరెంట్స్ అవాక్కవుతుంటారు. వారు పెట్టే పేచీకి ఏం సమాధానం చెప్పాలో అర్ధం కాక బుజ్జగించడానికి ప్రయత్నిస్తారు. చాక్లెట్, ఐస్ క్రీమ్ కావాలని మారాం చేస్తే కొనిస్తారు. అసాధ్యమైన వాటిని అడిగి ఏడుపు మొదలెడితే? అవి తీర్చలేకపోయినా వారి డిమాండ్లు చూస్తే ముచ్చటేస్తుంది. ఆ వయసులో వారికి వచ్చే ఆలోచనలు చూస్తే ముద్దొస్తుంది. సోషల్ మీడియాలో చిన్నారి అమేయ వీడియో వైరల్ అవుతోంది. ఈ చిన్నారి వీడియోని తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

కవిత షేర్ చేసిన వీడియోలో అమేయ తల్లిని అడిగింది చాక్లెట్, ఐస్ క్రీమ్ కాదు.. కేసీఆర్ తాతకు ఓటేస్తానని.. కన్నీరు పెట్టుకుని మరీ అమాయకంగా అడుగుతున్న ఆమేయ మోము చూస్తే జాలేస్తుంది. చిన్నపిల్లలకు ఓటర్ కార్డులు ఇవ్వరు.. 18 సంవత్సరాలు రావాలని తల్లి బుజ్జగిస్తూ చెప్పింది.. ఎవరికి ఓటేస్తావని తల్లి అడిగిన ప్రశ్నకి కేసీఆర్ తాతకు వేస్తానని చెప్పింది. ఆయనకు ఎందుకు వేస్తావన్న ప్రశ్నకు చాలా మంచి తాత అని.. తనని అస్సలు తిట్టడని.. వేరేవాళ్లని తిడతాడని చెప్పింది అమేయ. కేసీఆర్ తాత గుర్తు ఏంటని అడిగితే కారు గుర్తు అని చెప్పింది. వీడియో చివర్లో ఇప్పుడు వేయచ్చా ఓటు.. అని మళ్లీ తల్లిని అడిగింది అమేయ.. ఇక ఏం చెబుతుంది ఆ తల్లి.. సరే అని ఊరుకోబెట్టింది.

Shah Rukh Khan : అంబానీ ఇంట సెలబ్రేషన్స్‌లో.. పాములతో షారుఖ్ ఆటలు.. వీడియో వైరల్..

అమేయ ముద్దు మాటలకు ముచ్చటపడిన ఎమ్మెల్సీ కవిత తన ట్విట్టర్ ఖాతాలో వీడియోను షేర్ చేసారు. ‘ఈ వీడియో అమూల్యమైనది.. ప్రియమైన అమేయ నీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యవాదాలు, నీ గురించి కేసీఆర్ తాతకు చెబుతాను. నీకు ఆశీర్వాదాలు’ అనే శీర్షికను యాడ్ చేశారు. ఇక అమేయ ముద్దు మాటలు వింటే సీఎం కేసీఆర్ ఎంత ముచ్చట పడతారో కదా..