బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తే ఊరుకోబోమని ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు అదే పనిగా తిట్ల పరిపాలన చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ కవిత నివాసంలో కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ మొక్క అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని చెప్పారు. కేసీఆర్ మొక్క కాదు పీకేయడానికి… కేసీఆర్ ఒక వేగుచుక్క అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కలు చూపించి తెలంగాణ సాధించిన శక్తి కేసీఆర్ అని చెప్పుకొచ్చారు.
కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యి పారేవని కవిత చెప్పారు. ఇప్పుడు రాష్ట్రంలో తిట్లు పారుతున్నాయని అన్నారు. బ్రిటిష్ పాలనలో కూడా లేని చేనేతపై పన్నును ఇప్పుడు విధిస్తున్నారని, ప్రధాని మోదీ జీఎస్టీని విధించడం దౌర్భాగ్యమని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వ తరఫున చేనేతపై జీఎస్టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని తెలిపారు.
కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీని విస్మరించడం శోచనీయమని చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చేనేతపై కేంద్రం విధిస్తున్న జీఎస్టీని రియింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఎమ్మెల్సీ కవితను అఖిల భారత పద్మశాలి సంఘం నాయకులు కలిశారు. కులగణనపై బీసీ డెడికేటెడ్ కమిషన్ కు నివేదిక అందించినందుకు కవితకు ధన్యవాదాలు తెలియజేశారు.
Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన మమతా బెనర్జీ