Mother Dairy Elections: నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్)లో ఖాళీ అయిన మూడు డైరెక్టర్ స్థానాలకు ఇవాళ ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాద్ శివారులోని హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు ఇద్దరు గెలవగా, కాంగ్రెస్ మద్దతుదారుల్లో ఒక్కరు మాత్రమే విజయం సాధించారు.
కాంగ్రెస్ నేత, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వ్యూహం ఫలించింది. అదే పార్టీ నేత, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వ్యూహం మాత్రం బెడిసి కొట్టింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయారు. ఎన్నికైన సభ్యులు అక్టోబర్ 1న బాధ్యతలు చేపడతారు.
ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహించాలని, పదవికి రాజీనామా చేయాలని మందుల సామేల్ ఇటీవల డిమాండ్ చేశారు.
మదర్ డెయిరీ డైరెక్టర్ల ఎన్నికల్లో గెలుపొందినవారు
కర్నాటి జయశ్రీ (కాంగ్రెస్) – 176 ఓట్లు
రచ్చ లక్ష్మీ నరసింహారెడ్డి (బీఆర్ఎస్) – 154 ఓట్లు
సందిల భాస్కర్ గౌడ్ (బీఆర్‌ఎస్) – 240 ఓట్లు
ఓడిపోయిన వారు
మంచాల ప్రవీణ్ రెడ్డి -9 ఓట్లు
పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి -16 ఓట్లు
గంట్ల రాధిక (ఎంపీ చామల మద్దతుదారు) -55 ఓట్లు