MP Arvind
MP Arvind – Komatireddy Rajagopal Reddy : బీజేపీ నేత కోమటిరెడి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడంపై బీజేపీ నేత, ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి పార్టీ మారాడాన్ని ఎంపీ అర్వింద్ ఖండించారు. ఈ మేరకు ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా అర్వింద్ మాట్లాడుతూ.. నిలకడ లేని వ్యక్తులు పార్టీలు మారుతుంటారని ఆరోపించారు.
ఒకవేళ తాను బీజేపీ నాయకత్వం దగ్గరికి వెళ్లి తనకు, తన భార్యకు టికెట్ ఇవ్వాలని.. అలాగే తన పెద్ద కొడుకు 2034 వరకు తయారవుతాడని అప్పుడు ఆయనకు పార్లమెంట్ టికెట్, చిన్న కొడుకు 2044 కల్లా తయారవుతాడని అప్పటికల్లా ఆయనకు కూడా టికెట్ రిజర్వ్ చేసి ఉంచాలని అడిగితే.. పార్టీ నుంచి దయచేయండి అంటుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు పద్ధతులు, పాలసీలు ఉంటాయని తెలిపారు. అందులో ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, పాలసీలు బాగా బలంగా ఉంటాయని పేర్కొన్నారు. దానికి ఎక్కడ కూడా పార్టీ కాంప్రమైజ్ కాదని చెప్పారు.
Also Read: ఎన్నికల్లో వైఎస్ఆర్ టీపీకి బైనాక్యులర్ గుర్తు.. మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి
కాగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తీర్థ పుచ్చుకున్నారు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రాజగోపాల్ రెడ్డితోపాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సంతోష్ కుమార్ కాంగ్రెస్ లో చేశారు. వీరికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గతంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Also Read: బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి
గతంలో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఎన్నికల వేళ కోమటిరెడ్డి తిరిగి కాంగ్రెస్ లో చేరారు. కాగా, కోమటిరెడ్డి పార్టీ మారడం పట్ల బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఆయన తీరును తప్పుబడుతున్నారు.