×
Ad

Venkat Reddy Absent Munugode Meeting : మునుగోడు కాంగ్రెస్ సమావేశానికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా

మునుగోడు కాంగ్రెస్ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. మొదటి నుంచి మునుగోడు కాంగ్రెస్‌ సమావేశాలకు వెంకట్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం దామెరలో జరుగుతున్న టీపీసీసీ మీటింగ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు.

  • Published On : September 13, 2022 / 06:57 PM IST

Venkat Reddy Absent Munugode Meeting

Venkat Reddy Absent Munugode Meeting : మునుగోడు కాంగ్రెస్ సమావేశానికి ఆ పార్టీ ఎంపీ, స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డుమ్మా కొట్టారు. మొదటి నుంచి మునుగోడు కాంగ్రెస్‌ సమావేశాలకు వెంకట్‌రెడ్డి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు ఆయనను బుజ్జగించారు. అయినా తాజాగా చౌటుప్పల్ మండలం దామెరలో జరుగుతున్న టీపీసీసీ మీటింగ్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరుకాలేదు.

ఇక మునుగోడు కాంగ్రెస్ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధి కోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తే కాంగ్రెస్‌ పార్టీ టికెట్ ఇవ్వనందా అని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు మునుగోడులో తమకు టీఆర్‌ఎస్‌తోనే ప్రధాన పోటీనని మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అన్నారు.

Munugode by Poll : రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని మునుగోడు కాంగ్రెస్ నేతలను వేధిస్తున్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

అభ్యర్థిగా ఖరారు అయిన తర్వాత మొదటిసారిగా మునుగోడుకు వచ్చిన స్రవంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాసేపట్లో ముఖ్య కార్యకర్తలు, బూత్‌ ఇంచార్జ్‌లతో స్రవంతి సమావేశం కానున్నారు. ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ పాల్గొననున్నారు. మునుగోడులో తమకే ప్రజాబలం ఉందని అంటున్నారు.