CM KCR Review : పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి : సీఎం కేసీఆర్

పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

CM KCR Review : పట్టణ ప్రగతిపై మున్సిపాలిటీలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈరోజు ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్లు, డీపీవోలతో పల్లె, పట్టణ ప్రగతి  ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఆయన మాట్లాడుతూ….గ్రామాభివృద్ధిలో కేరళ ఆదర్శంగా నిలిచిందని …కేరళ పర్యటనకు కొంతమంది అదనపు కలెక్టర్లను, డీపీవోలను ఎంపిక చేసి పంపించాలని… అక్కడ అమలవుతున్న విధానాలు పరిశీలించి తెలంగాణలో అమలయ్యేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

ఢిల్లీ, తమిళనాడు ప్రభుత్వాలు అమలు పరుస్తున్న కొన్ని పథకాలను తెలంగాణ కూడా ఆదర్శంగా తీసుకుందని కేసీఆర్ చెప్పారు. అధికారులు అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. ‘సేవ్ ద పీపుల్, సేవ్ ద విలేజెస్, సేవ్ యువర్ సెల్ఫ్’ నినాదంతో అధికారులు పనిచేయాలని కేసీఆర్ సూచించారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల పరిశుభ్రత బాధ్యతను, గ్రామ సర్పంచి తీసుకోవాలి. మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాసంబంధ సంస్థల పారిశుధ్య బాధ్యతను మున్సిపాలిటి పాలకవర్గాలు తీసుకోవాలని కేసీఆర్ అన్నారు.

నర్సరీలు, వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, పబ్లిక్ టాయిలెట్లు, వైకుంఠధామాలు సహా అన్ని అంశాల్లో ప్రతీ పట్టణానికి ఒక స్టేటస్ రిపోర్టు తయారుచేయాలని సీఎం సూచించారు. వైకుంఠ ధామాలకు కాంపౌండుగా గోడలను కాకుండా గ్రీన్ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రామాలు పట్టణాల్లో ఉన్న ప్రకృతి వనాల నిర్మాణం, డంపు యార్డుల నిర్మాణం వివరాలను సీఏం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణలో సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పట్టణాల్లో మహిళలకు పబ్లిక్ టాయిలెట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలి. మిషన్ భగీరథ అంతర్గతంగా పైప్ లైన్ల సమస్యను పరిష్కరించుకోవాలి. పట్టణాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేసే లే అవుట్స్ విషయంలో అదనపు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేసీఆర్ అన్నారు.

లే అవుట్లల్లో కమ్యూనిటీలకు కేటాయించిన కమ్యూనిటీ హాల్, ట్రాన్స్ ఫార్మర్స్, సబ్ స్టేషన్స్, వాటర్ ట్యాంకర్ తదితరాలకు కేటాయించిన స్థలాలను కూడా లే అవుట్ యజమానులు తర్వాత అమ్ముకుంటున్నారని వాటిని ముందే మున్సిపాలిటీల పేరు మీద రిజిస్టర్ చేయించేలా జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. పర్సనల్ అప్రేజల్ రిపోర్టును తయారు చేయడం ద్వారా  కలెక్టర్ల పనితీరును రికార్డు చేస్తామని కేసీఆర్ అన్నారు.

ట్రెండింగ్ వార్తలు