RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని

‘రౌద్రం,రణం, రుధిరం’(‘RRR’)సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశం గర్విస్తోంది అంటూ రాజకీయ, సిని ప్రముఖులు RRR సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ ఘనతపై తెలంగాణ రాష్ట్రం హర్షం వ్యక్తంచేసింది. RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం అని ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి తలసాని ప్రకటించారు.

RRR ‘Naatu Naatu Oscars95’ : ‘రౌద్రం,రణం, రుధిరం’(‘RRR’)సినిమాలోని ‘నాటు నాటు’పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో భారతదేశం గర్విస్తోంది అంటూ రాజకీయ, సిని ప్రముఖులు RRR సినిమా టీమ్ కు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అంతర్జాతీయ యవనికపై సాటిన సత్తాకు ఎన్నో అభినందనలు అందుతున్నాయి. ఈక్రమంలో RRR టీమ్ ను ప్రభుత్వం తరపున ఘనంగా సత్కరిస్తాం అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..తెలుగు చలన చిత్ర ఖ్యాతిని RRR సినిమా చాటి చెప్పిందని అన్నారు. అంతగొప్ప ఘనత సాధించిన RRR టీమ్ కు అభినందలు అని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం తరుపున RRR టీమ్ ను ఘనంగా సత్కరిస్తామని తెలిపారు.

Oscars 2023 Awards Full List : 95వ ఆస్కార్ అవార్డుల ఫుల్ లిస్ట్.. ఏ సినిమాకు ఏ అవార్డు వచ్చిందో తెలుసా?

ఈ సినిమా దర్శకుడు ఏ సినిమా చేసినా విజయాల పరంపరను సాధిస్తున్నారు. అటువంటి రాజ‌మౌళి దర్శకత్వంతో ఇంతటి ఘనత సాధించని RRR సినిమా బృందం పడిన కష్టానికి తగిన ప్రతిఫలితం దక్కిందన్నారు. దర్శకుడు రాజమౌళి కృషితోనే RRR సినిమా పాటకు ఆస్కార్ వరించందని అన్నారు మంత్రి త‌ల‌సాని.సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో FDC చైర్మన్ అనిల్ కూర్మాచలంతో కలిసి మాట్లాడారు. RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్ లభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ప్రకటన చేశారు మంత్రి త‌ల‌సాని.

Naatu Naatu : నాటు నాటు ఆస్కార్ గెలుపుపై రాజకీయ ప్రముఖుల కామెంట్స్.. మోదీ, జగన్, చంద్రబాబు, కేసీఆర్.. అభినందనలు..

అత్యంత గొప్ప అవార్డు ఆస్కార్ ను అందుకున్న ఏకైక సినిమా సినిమాగా RRR చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని చెప్పారు. ఈ సినిమాను అకుంఠిత దీక్షతో తీర్చి దిద్దిన దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి..నాటు నాటు పాట రాసిన రచయిత చంద్రబోస్. పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కు ఇలా ఆస్కార్ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికి అభినందనలు అని తెలిపారు.

RRR : ఆస్కార్ అందుకున్న కీరవాణి పాప్ స్టైల్‌లో స్పీచ్.. తెలుగు భాషలోని గొప్పతనాన్ని వివరిస్తూ చంద్రబోస్..

 

ట్రెండింగ్ వార్తలు