×
Ad

Naini Coal Block Tender: నైనీ కోల్ మైన్స్ టెండర్ నోటిఫికేషన్ రద్దు.. అసలేం జరిగింది.. కారణం అదేనా

తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లపై రాజకీయ వివాదం చెలరేగింది. నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఒక్కసారిగా కోల్ వార్ మొదలైంది.

Naini Coal Block Tender Representative Image (Image Credit To Original Source)

  • తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లపై రాజకీయ వివాదం
  • నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ రద్దు
  • సీఎం రేవంత్ బావమరిదికి లబ్ది కోసమే అని ఆరోపణలు
  • సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

Naini Coal Block Tender: నైనీ కోల్ మైన్స్ టెండర్ల విషయంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి తీసుకోవాల్సిన బిడ్స్ ని రద్దు చేస్తునట్లు ప్రకటించింది. పాలనాపరమైన కారణాలతో టెండర్లు రద్దు చేసినట్లు చెప్పింది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో మరోసారి చర్చిస్తామని ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలియజేశారు.

ఇటు నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విషయంలో సింగరేణి పాలక మండలిని కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రశ్నించింది. సంస్థ విధించిన నిబంధనలపై పాలక మండలి ఎందుకు చర్చించలేదని అడిగింది. చర్చించి ఉంటే టెండర్ల విషయంలో అవినీతి ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని, టెండర్ వేయాలనుకున్న కంపెనీలకు ఎందుకు సైట్ విజిట్ ధృవీకరణ పత్రాలు ఇవ్వడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ అడిగింది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలిలో చర్చించి మరోసారి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు సింగరేణి అధికారులు. కాగా.. బొగ్గు బ్లాక్ ల టెండర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నైనీ కోల్ మైన్స్ టెండర్స్ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ది కలిగించేందుకే?

తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లపై రాజకీయ వివాదం చెలరేగింది. నైనీ బొగ్గు గని టెండర్ నోటిఫికేషన్ ప్రభుత్వం రద్దు చేయడంతో ఒక్కసారిగా కోల్ వార్ మొదలైంది. నోటిఫికేషన్ రద్దుపై సీబీఐ విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సీఎం రేవంత్ కి, బీజేపీకి చీకటి ఒప్పందం జరిగిందని.. అందుకే రద్దు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. సీఎం రేవంత్ బావమరిదికి లబ్ది చేకూర్చేందుకే సైట్ విజిట్ సర్టిఫికెట్ నిబంధన తెచ్చారని హరీశ్ రావు అంటున్నారు. బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే హరీశ్ రావుకి నోటీసులు ఇచ్చారని కేటీఆర్ ఆరోపించారు.

బొగ్గు గనుల టెండర్ల రద్దు.. సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్

సింగరేణి చుట్టూ రాజకీయ వివాదం చెలరేగింది. బొగ్గు గనుల కేటాయింపులపై బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఒడిశాలోని నైనీ బొగ్గు గనుల టెండర్లతో వివాదం మొదలైంది. రేవంత్ రెడ్డి బావమరిదికి లబ్ది కలిగించేందుకే తెలంగాణ ప్రభుత్వం టెండర్ల నిబంధనల్లో మార్పులు చేసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానం తెచ్చి గ్లోబల్ టెండర్లలో పాల్గొంటున్న వారి వివరాలు తెలుసుకుని వారు టెండర్లలో పాల్గొనకుండా చేసి రేవంత్ రెడ్డి బావమరిదికి టెండర్లు దక్కేలా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది. అందులో భాగంగానే నైనీ బొగ్గు గనుల కేటాయింపు టెండర్లను భట్టి విక్రమార్క రద్దు చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

నైనీ బొగ్గు గనుల టెండర్ల రద్దుతో పాటు ఇతర బొగ్గు గనుల కేటాయింపులపై సీబీఐ విచారణకు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ బావమరిది టెండర్ల విషయాన్ని బయటపెట్టినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు.