Road Accident : నల్గొండ జిల్లాలో పండగపూట విషాదం.. వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి

నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.

Road Accident

Nalgonda district : నల్గొండ జిల్లాలో పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. బైక్ ఢీకొనడంతో ఇద్దరు మృతిచెందారు. ఈ విషయం తెలుసుకున్న బైకిస్టు బంధువులు ఆటోలో ఘటన స్థలికి వెళ్తుండగా ట్యాంకర్ ఆటోను ఢీకొటింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. నిడమానూరు మండలం వెంపాడ్ స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Also Read : Dog Attack Baby Dies: హైదరాబాద్ షేక్‌పేటలో విషాదం.. కుక్కల దాడిలో గాయపడ్డ ఐదు నెలల పసికందు మృతి

నల్గొండ జిల్లా పరిధిలోని కోదాడ – జడ్చర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి 10గంటల సమయంలో వేంపాడు స్టేజీ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తితోపాటు బైక్ పై వ్యక్తి ఇద్దరూ మృతి చెందారు. వీరి మృతదేహాలను మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. బైకిస్టు మృతి సమాచారం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు, బంధువులు ఓ టాటాఏసీ ఆటోలో ఆస్పత్రికి బయలు దేరారు. ఏడుగురు టాటాఏసీ ఆటోలో వెళ్తున్నక్రమంలో పార్వతీపురం ఎక్స్ రోడ్డు వద్ద ఎదురుగా రాంగ్ రూట్ లో వచ్చిన లారీ ట్యాంకర్ ఆటోను బలంగా ఢీకొట్టింది. సుమారు 50 మీటర్ల మీర లారీ ఆటోను నెట్టుకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురిలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Also Read : VC Sajjanar : నడిరోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ వద్ద యువతి డ్యాన్స్ .. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సీరియస్

ఈ ప్రమాదానికి కారణం లారీని క్లీనర్ నడుపుతుండటంతోపాటు మద్యం మత్తులో నడపడమే కారణమని తెలుస్తోంది. బైక్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి కొద్దిదూరంలోనే లారీ, టాటాఏసీ వాహనం ప్రమాదం జరిగింది. బైక్ ప్రమాదంలో రమావత్ సేవలు (శివ నాయక్ (20), బలుగూరి సైదులు (55) మృతిచెందారు. లారీ ఢీకొట్టిన ప్రమాదంలో మూడువ బుజ్జి(40), రమావత్ పాండు (45), రమావత్ గణ్య (48),మూడవ నాగరాజు (28) మృత్యువాత పడ్డారు. మృతులు నీమానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లెవాని కుంట తండాకు చెందిన వారిగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను మిర్యాలగూడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.